యస్‌ బ్యాంక్‌ వీక్‌- ఆర్కిడ్‌ స్పీడ్‌

యస్‌ బ్యాంక్‌ వీక్‌- ఆర్కిడ్‌ స్పీడ్‌

కొద్ది రోజులుగా నేలచూపులకే పరిమితమవుతున్న ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ కౌంటర్లో మరోసారి అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే కట్టుబడటంతో లాభాల మార్కెట్లోనూ ఈ కౌంటర్‌ డీలాపడింది. కాగా.. మరోపక్క కంపెనీ దాఖలు చేసిన ఏఎన్‌డీఏకు యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి లభించినట్లు వెల్లడించడంతో ఆర్కిడ్‌ ఫార్మా లిమిటెడ్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వివరాలు చూద్దాం..

యస్‌ బ్యాంక్‌
ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌కు అదనపు డైరెక్టర్‌గా రామ సుబ్రహ్మణ్యం గాంధీని తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఎంపిక చేసింది. ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌గా పనిచేసిన గాంధీ రెండేళ్లపాటు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ అంశాన్ని యస్‌ బ్యాంక్‌ బీఎస్‌ఈకి తెలియజేసింది. గాంధీ ఎంపికతో బ్యాంక్‌ బోర్డు మరింత పటిష్టంకానున్నట్లు పేర్కొంది. కాగా.. ఇటీవల యస్‌ బ్యాంక్‌ దీర్ఘకాలిక రేటింగ్స్‌ను కేర్‌, బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌, ఇక్రా డౌన్‌గ్రేడ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం యస్‌ బ్యాంక్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 4 శాతం పతనమై రూ. 150 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 148 వరకూ జారింది. ఇది 5 నెలల కనిష్టంకాగా.. ఇప్పటివరకూ 27 మిలియన్‌ షేర్లు ట్రేడయ్యాయి. గత నెల రోజుల్లో ఈ షేరు 44 శాతం కుప్పకూలడం గమనార్హం!

Image result for orchid pharmaceuticals

ఆర్కిడ్ కెమికల్స్‌
రైజ్‌డ్రొనేట్‌ సోడియం ట్యాబ్లెట్లకు యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి లభించినట్లు  ఆర్కిడ్‌ ఫార్మా లిమిటెడ్‌ తాజాగా వెల్లడించింది. ఎముకలు బలహీనపడే వ్యాధి (ఓస్టియోపొరోసిస్‌) చికిత్సకు వినియోగించగల వీటిని 30 ఎంజీ, 35 ఎంజీ డోసేజీలలో విక్రయించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్కిడ్ కెమికల్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 4 వద్ద ట్రేడవుతోంది. Most Popular