జెట్‌ ఎయిర్‌- జీ మీడియా పతనం

జెట్‌ ఎయిర్‌- జీ మీడియా పతనం

ఉన్నట్టుండి ముగ్గురు టాప్‌ ఎగ్జిక్యూటివ్స్‌ కంపెనీ నుంచి వైదలగడంతో విమానయాన రంగ సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే రుణాల చెల్లింపుల్లో విఫలం, నష్టాలు, కార్యకలాపాల నిలిపివేత వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో ఈ కౌంటర్‌ కొద్ది రోజులుగా పతనబాటలో సాగుతున్న విషయం విదితమే. కాగా.. గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటంచడంతో జీ మీడియా కార్పొరేషన్‌ కౌంటర్లోనూ అమ్మకాలు ఊపందుకున్నాయి. వివరాలు చూద్దాం..

జెట్‌ ఎయిర్‌వేస్‌
సీఈవో వినయ్‌ దూబే, సీఎఫ్‌వో అమిత్‌ అగర్వాల్‌, కంపెనీ సెక్రటరీ కుల్దీప్‌ శర్మ పదవులకు రాజీనామా చేసినట్లు జెట్ ఎయిర్‌వేస్‌ తాజాగా పేర్కొంది. ఇటీవలే కంపెనీ అధికారులు రాహుల్‌ తనేజా, గౌరంగ్ శెట్టి సైతం కంపెనీకి వీడ్కోలు పలికారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం పతనమై రూ. 123 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 120 వరకూ జారింది. తద్వారా 2009 మార్చి 12న నమోదైన చరిత్రాత్మక కనిష్టం రూ. 115కు చేరువైంది. ఎస్‌బీఐ అధ్యక్షతన రుణదాతల కన్సార్షియం కంపెనీలో మెజారిటీ వాటా విక్రయానికి చేపట్టిన బిడ్డింగ్‌ ముగిసినప్పటికీ ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ మాత్రమే అదికూడా మైనారిటీ వాటాకే కట్టుబడనున్నట్లు తెలియజేయడంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ కౌంటర్‌ డీలా పడింది. గత మూడు రోజుల్లో ఈ షేరు 20 శాతం తిరోగమించిన సంగతి తెలిసిందే.

Image result for zee media corporation

జీ మీడియా కార్పొరేషన్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో జీ మీడియా కార్పొరేషన్‌ రివర్స్‌ టర్న్‌అరౌండ్‌ ఫలితాలు ప్రకటించింది. క్యూ4లో దాదాపు రూ. 87 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2017-18) క్యూ4లో రూ. 11.5 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 4 శాతం క్షీణించి రూ.169 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో జీ మీడియా షేరు 6.2 శాతం పతనమై రూ. 13.70 వద్ద ట్రేడవుతోంది. Most Popular