నెస్లే ఇండియా- ఎండ్యూరెన్స్ జోష్‌

నెస్లే ఇండియా- ఎండ్యూరెన్స్ జోష్‌

గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో అంచనాలకు అనుగుణమైన ఫలితాలు సాధించడంతో ఎఫ్‌ఎంసీజీ విదేశీ దిగ్గజం నెస్లే ఇండియా కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. కాగా.. మరోవైపు గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఆటో విడిభాగాల సంస్థ ఎండ్యూరెన్స్‌ టెక్నాలజీస్‌ కౌంటర్‌కు సైతం డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్లర్ల కొనుగోళ్లతో ఈ రెండు కౌంటర్లూ సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

నెస్లే ఇండియా
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో నెస్లే ఇండియా నికర లాభం 9 శాతం పెరిగి రూ. 463 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం 9 శాతం పుంజుకుని రూ. 3003 కోట్లను తాకింది. ఇబిటా 6 శాతం బలపడి రూ. 738 కోట్లకు చేరగా.. మార్జిన్లు 25.3 శాతం నుంచి 24.6 శాతానికి స్వల్పంగా నీరసించాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో నెస్లే ఇండియా షేరు 2 శాతం పెరిగి రూ. 1161 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1164 వరకూ ఎగసింది. 

Image result for endurance technologies ltd

ఎండ్యూరెన్స్‌ టెక్నాలజీస్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఎండ్యూరెన్స్‌ టెక్నాలజీస్‌ నికర లాభం 28 శాతం జంప్‌చేసి రూ. 148 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం 10 శాతం పుంజుకుని రూ. 1900 కోట్లను తాకింది. ఇబిటా 26 శాతం ఎగసి రూ. 324 కోట్లకు చేరగా.. మార్జిన్లు 14.8 శాతం నుంచి 17 శాతానికి బలపడ్డాయి. వాటాదారులకు షేరుకి రూ. 5.5 డివిడెండ్‌ చెల్లించనుంది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎండ్యూరెన్స్‌ టెక్‌ షేరు 2.5 శాతం పెరిగి రూ. 1175 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1179 వరకూ ఎగసింది.Most Popular