యూబీఐ డౌన్‌- హింద్‌ ఆయిల్‌ ప్లస్‌

యూబీఐ డౌన్‌- హింద్‌ ఆయిల్‌ ప్లస్‌

గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు అంచనాలను చేరకపోవడంతో పీఎస్‌యూ సంస్థ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో లాభాల మార్కెట్లోనూ ఈ షేరు నష్టాలతో కళతప్పింది. కాగా.. మరోవైపు గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఇంధన రంగ సంస్థ హిందుస్తాన్‌ ఆయిల్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. వివరాలు చూద్దాం..

యూనియన్‌ బ్యాంక్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో యూనియన్‌ బ్యాంక్‌ రూ. 3369 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2017-18) క్యూ4లో రూ. 2583 కోట్ల నష్టం నమోదైంది. నికర వడ్డీ ఆదాయం మాత్రం 19 శాతం పెరిగి రూ. 2601 కోట్లను తాకింది. ప్రొవిజన్లు 3 శాతం పెరిగి రూ. 5783 కోట్లను తాకాయి. నికర మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 8.27 శాతం నుంచి 6.85 శాతానికి తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో యూనియన్‌ బ్యాంక్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో దాదాపు 8 శాతం పతనమై రూ. 73 వద్ద ట్రేడవుతోంది. 

Related image

హింద్‌ ఆయిల్
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో హింద్‌ ఆయిల్ ఎక్స్‌ప్లొరేషన్‌ నికర లాభం 38 శాతం పెరిగి రూ. 48 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 8 శాతం పుంజుకుని రూ. 71 కోట్లను అధిగమించింది. ఇబిటా 20 శాతం జంప్‌చేసి రూ. 52 కోట్లకు చేరింది. మార్జిన్లు 66.2 శాతం నుంచి 73.4 శాతానికి బలపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో హింద్‌ ఆయిల్ షేరు జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 3.5 శాతం జంప్‌చేసి రూ. 128 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 132 వరకూ ఎగసింది. Most Popular