సెంచరీతో షురూ- లాభాల్లో మార్కెట్లు

సెంచరీతో షురూ- లాభాల్లో మార్కెట్లు

అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కార చర్చలపై తిరిగి ఆశావహ పరిస్థితులు నెలకొనడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 119 పాయింట్లు ఎగసి 37,438కు చేరగా.. నిఫ్టీ 34 పాయింట్లు పుంజుకుని 11,256 వద్ద ట్రేడవుతోంది. ఓ వైపు అమెరికన్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌, మరోపక్క చైనా విదేశాంగ శాఖ వాణిజ్య వివాద పరిష్కార చర్చలు కొనసాగించడంపై సానుకూలంగా స్పందించడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దేశీయంగా మార్కెట్లు వరుసగా నష్టపోవడంతో ట్రేడర్లు స్క్యేరప్‌ లావాదేవీలు చేపడుతున్నట్లు తెలియజేశారు.

ఐటీ ప్లస్‌లో 
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా రియల్టీ, ఆటో, ప్రయివేట్ బ్యాంక్స్‌, ఐటీ, మెటల్‌, ఫార్మా 0.7-0.3 శాతం మధ్య లాభపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐవోసీ, బీపీసీఎల్‌, యూపీఎల్‌, ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్‌, ఐషర్, టెక్‌ మహీంద్రా, అదానీ పోర్ట్స్‌, టాటా స్టీల్‌, హిందాల్కో 1.6-1 శాతం మధ్య ఎగశాయి. అయితే యస్ బ్యాంక్‌, జీ, ఎయిర్‌టెల్, సన్ ఫార్మా, కోల్‌ ఇండియా, ఇన్‌ఫ్రాటెల్‌, బజాజ్‌ ఆటో 2-0.5 శాతం మధ్య డీలాపడ్డాయి.  

డెరివేటివ్స్‌ ఇలా
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో అజంతా ఫార్మా, ఇండిగో, డీసీబీ బ్యాంక్‌, జస్ట్‌ డయల్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, ఐసీఐసీఐ ప్రు, పీసీ జ్యువెలర్స్‌, ఈక్విటాస్ 3-2  శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు యూనియన్‌ బ్యాంక్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ 5 శాతం చొప్పున పతనంకాగా, దివాన్‌ హౌసింగ్, ఐడియా, మ్యాక్స్‌ ఫైనాన్స్‌ 4-2 శాతం మధ్య క్షీణించాయి. 

స్మాల్‌ క్యాప్స్‌ గుడ్‌
మార్కెట్లు హుషారుగా ప్రారంభమైన నేపథ్యంలో మధ్య, చిన్నతరహా షేర్లకు డిమాండ్‌ కనిపిస్తోంది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.25-0.5 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 793 లాభపడగా.. 456 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో ఎస్‌పీఎంఎల్‌, స్నోమ్యాన్‌, టీటీకే, స్పైస్‌జెట్‌, పీజీఈఎల్‌, నిట్కో, ఉత్తమ్‌ షుగర్‌, హబ్‌టౌన్‌, న్యూలాండ్‌ లేబ్‌, హింద్‌ ఆయిల్‌, యుఫో తదితరాలు 8-5 శాతం మధ్య జంప్‌చేశాయి.Most Popular