ముత్తూట్‌ భళా- హనీవెల్‌ నాట్‌వెల్‌

ముత్తూట్‌ భళా- హనీవెల్‌ నాట్‌వెల్‌

గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు అంచనాలను చేరడంతో ఎన్‌బీఎఫ్‌సీ ముత్తూట్‌ ఫైనాన్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో కన్సాలిడేషన్‌ మార్కెట్లోనూ ఈ షేరు లాభాలతో సందడి చేస్తోంది. కాగా.. మరోవైపు గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ ఇంజినీరింగ్‌ దిగ్గజం హనీవెల్‌ ఆటోమేషన్‌ కౌంటర్‌లో అమ్మకాలు తలెత్తాయి. వివరాలు చూద్దాం..

ముత్తూట్‌ ఫైనాన్స్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ముత్తూట్‌ ఫైనాన్స్‌ నికర లాభం నామమాత్ర వృద్ధితో రూ. 511 కోట్లను అధిగమించింది. నికర వడ్డీ ఆదాయం మాత్రం 3.4 శాతం పెరిగి రూ. 1221 కోట్లను తాకింది. కాగా.. పూర్తిఏడాదికి నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన 14 శాతం ఎగసి రూ. 2103 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ముత్తూట్‌ ఫైనాన్స్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 575 వద్ద ట్రేడవుతోంది. 

Image result for honeywell automation india ltd

హనీవెల్‌ ఆటోమేషన్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో హనీవెల్‌ ఆటోమేషన్‌ నికర లాభం 44 శాతం పెరిగి రూ. 84 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 26 శాతం పుంజుకుని రూ. 810 కోట్లను అధిగమించింది. ఇబిటా 55 శాతం జంప్‌చేసి రూ. 125 కోట్లకు చేరింది. మార్జిన్లు 12.6 శాతం నుంచి 15.4 శాతానికి బలపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో హనీవెల్‌ ఆటోమేషన్‌ షేరు డీలాపడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 2.5 శాతం నీరసించి రూ. 23,275 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 23,117 వరకూ జారింది. Most Popular