క్యూ4- కర్ణాటక బ్యాంక్‌- సీసీఎల్‌ బోర్లా

క్యూ4- కర్ణాటక బ్యాంక్‌- సీసీఎల్‌ బోర్లా

గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు అంచనాలను చేరకపోవడంతో ప్రయివేట్‌ రంగ సంస్థ కర్ణాటక బ్యాంక్‌ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడుతున్నారు. కాగా.. మరోవైపు గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ ఇండియా  కౌంటర్‌లోనూ అమ్మకాలు నమోదవుతున్నాయి. ఇతర వివరాలు చూద్దాం..

కర్ణాటక బ్యాంక్‌ 
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో కర్ణాటక బ్యాంక్‌ నికర లాభం 6 శాతం పెరిగి రూ. 62 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం మాత్రం 11 శాతం క్షీణించి రూ. 481 కోట్లను తాకింది. ప్రొవిజన్లు 60 తగ్గి రూ. 218 కోట్లకు పరిమితమయ్యాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 4.45 శాతం నుంచి 4.41 శాతానికి, నికర ఎన్‌పీఏలు 3 శాతం నుంచి 2.95 శాతానికి స్వల్పంగా బలహీనపడ్డాయి. వాటాదారులకు షేరుకి రూ. 3.5 డివిడెండ్‌ ప్రకటించింది. సీఎఫ్‌వోగా మురళీధర్‌ కృష్ణారావును ఎంపిక చేసుకున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో కర్ణాటక బ్యాంక్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 6.3 శాతం పతనమై రూ. 111 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 109 వరకూ జారింది.

Related image
 
సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ నికర లాభం 25 శాతం క్షీణించి రూ. 36 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 18 శాతం నీరసించి రూ. 262 కోట్లను తాకింది. ఇబిటా 24 శాతం వెనకడుగుతో రూ. 54 కోట్లకు చేరింది. మార్జిన్లు 22.2 శాతం నుంచి 20.6 శాతానికి బలహీనపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 3.5 శాతం పతనమై రూ. 261 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 258 వరకూ జారింది. Most Popular