పడకేసిన పయనీర్‌- షెమారూ..!

పడకేసిన పయనీర్‌- షెమారూ..!

గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో రివర్స్‌ టర్న్‌అరౌండ్‌ ఫలితాలు సాధించడంతో ప్రయివేట్‌ రంగ సంస్థ పయనీర్ డిస్టిల్లరీస్‌ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడుతున్నారు. కాగా.. మరోవైపు గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో సాధించిన ఫలితాలు అంచనాలను చేరకపోవడంతో షెమారూ ఎంటర్‌టైన్‌మెంట్‌ కౌంటర్‌లోనూ అమ్మకాలు తలెత్తాయి. ఇతర వివరాలు చూద్దాం..

పయనీర్‌ డిస్టిల్లరీస్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో పయనీర్‌ డిస్టిల్లరీస్‌ రూ. 24 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2017-18) క్యూ4లో రూ. 21 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం 7 శాతం క్షీణించి రూ. 33.5 కోట్లను తాకింది. ఇబిటా నష్టం రూ. 17 కోట్లకు చేరింది. గతంలో రూ. 0.7 కోట్ల ఇబిటా సాధించింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో పయనీర్‌ డిస్టిల్లరీస్‌ షేరు 6 శాతం పతనమై రూ. 122 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 120 వరకూ నీరసించింది. 

Image result for shemaroo entertainment ltd

షెమారూ ఎంటర్‌టైన్‌మెంట్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో షెమారూ ఎంటర్‌టైన్‌మెంట్‌ నికర లాభం 12 శాతం పెరిగి రూ. 21 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 12 శాతం పుంజుకుని రూ. 132 కోట్లను అధిగమించింది. ఇబిటా 11 శాతం ఎగసి రూ. 41 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో షెమారూ షేరు డీలాపడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 3.3 శాతం నీరసించి రూ. 369 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 365 వరకూ జారింది. Most Popular