4శాతం తగ్గిన డీ-మార్ట్ లాభాలు! అధిక వ్యయాలే కారణమా?

4శాతం తగ్గిన డీ-మార్ట్ లాభాలు! అధిక వ్యయాలే కారణమా?

భారత దేశపు అతిపెద్ద ఆహార, గ్రోసరీ రిటైలర్ డీమార్ట్ ఆదాయంలో క్షీణత నమోదు అవుతోంది. పోటీ సంస్థల ప్రభావం, అధిక వ్యయాలు వంటి కారణాలతో గత రెండు సంవత్సరాల కనిష్టానికి లాభాలు పడిపోయాయి. డీమార్ట్ మాతృసంస్థ అయిన అవెన్యూ సూపర్ మార్ట్ లిమిటెడ్ నెట్ ప్రాఫిట్ గత మూడు త్రైమాసిక ఫలితాల్లో లాభాలు చూపించినప్పటికీ ఇవి ప్రతి ఇంక్రిమెంటల్ సేల్స్ లోనూ తక్కువగానే నమోదు కావడం విశేషం. రాధాకృష్ణ దమానీకి చెందిన డీమార్ట్ రిటైలర్స్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ దాదాపు 4శాతం తగ్గింది. అధిక వ్యయాలు, మిగతా పోటీ సంస్థలైన రిలయన్స్ రిటైల్, బిగ్ బజార్, బిగ్ బాస్కెట్ , అమెజాన్ , ఫ్లిప్ కార్ట్ వంటి వాటితో తీవ్రమైన పోటీ డీమార్ట్ నెట్ ప్రాఫిట్స్ లో క్షీణతకు కారణంగా తెలుస్తోంది. గ్రోసరీ రిటైల్ వ్యాపారం  దేశంలో వేగంగా విస్తరింస్తోందని, ఇదే సమయంలో వ్యాపార విస్తరణ, అధిక మార్జిన్లను నిలబెట్టుకోడం డీమార్ట్‌కు కష్టసాధ్యంగా మారిందని క్రెడిట్ సూసీ పేర్కొంది.

D-Mart Earns Less Profit From Every Rupee Of Sales

courtasy by: Bloomberg

ఇప్పటికే డీ మార్ట్ తన రిటైల్ స్టోర్లను విస్తరించే యత్నాల్లో ఉంది. దేశ వ్యాప్తంగా మరో 12 స్టోర్లను డీ మార్ట్ ప్రారంభించనుంది. ఈ మార్చ్ త్రైమాసిక ఫలితాల్లో రెవిన్యూ మరియు ప్రాఫిట్ల విషయంలో క్షీణతను నమోదు చేసినప్పటికీ... విక్రయాల నుంచి వచ్చిన ఆదాయంలో 28-32 శాతం గ్రోత్‌ను కనబరిచింది. గత సంవత్సరం తో పోలిస్తే.. డీమార్ట్ ఆదాయం మెరుగ్గానే ఉన్నప్పటికీ.. గత రెండు సంవత్సరాల వృద్ధితో పోలిస్తే.. మార్చ్ క్వార్టర్‌లో వచ్చిన లాభాలు చాలా తక్కువే అని ఎనలిస్టులు, బ్రోకింగ్ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. నేటి మంగళ వారం నాటి ఇంట్రాడేలో అవెన్యూ సూపర్  మార్ట్ (DMART) షేర్ రూ.1240.05 వద్ద ట్రేడ్ అవుతోంది. 

Image result for dmart hyderabad
 Most Popular