అటూఇటూ- పీఎస్‌యూ బ్యాంక్స్‌ అప్

అటూఇటూ- పీఎస్‌యూ బ్యాంక్స్‌ అప్

అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదురుతున్న పరిస్థితులలో దేశీ స్టాక్‌ మార్కెట్లు బలహీనంగా ప్రారంభమయ్యాయి. తదుపరి కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 55 పాయింట్లు నీరసించి 37,036కు చేరగా.. నిఫ్టీ 21 పాయింట్ల వెనకడుగుతో 11,127 వద్ద ట్రేడవుతోంది. ఇప్పటికే 200 బిలియన్‌ డాలర్ల చైనీస్‌ దిగుమతులపై వాషింగ్టన్‌ ప్రభుత్వం టారిఫ్‌లను పెంచగా.. 60 బిలియన్‌ డాలర్ల అమెరికన్‌ దిగుమతులపైనా సుంకాల విధింపునకు చైనీస్‌ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలహీనపడింది. దీనికితోడు ఇటీవల ఎఫ్‌పీఐలు అమ్మకాలకే కట్టుబడటంతో దేశీయంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగినట్లు నిపుణులు తెలియజేశారు. 

ఫార్మా ప్లస్‌లో 
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మీడియా, రియల్టీ, ఐటీ 1.1-0.6 శాతం మధ్య నీరసించగా..  పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఫార్మా  1-0.6 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఆటో, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, విప్రో, టాటా స్టీల్‌, యూపీఎల్‌, ఐషర్‌, ఓఎన్‌జీసీ, ఇన్ఫోసిస్‌ 2-1 శాతం క్షీణించాయి. అయితే సన్‌ ఫార్మా, వేదాంతా, అదానీ పోర్ట్స్‌, ఐబీ హౌసింగ్‌, ఐసీఐసీఐ, గెయిల్‌, ఆర్‌ఐఎల్‌, యస్‌ బ్యాంక్‌, జీ, పవర్‌గ్రిడ్‌ 3-0.5 శాతం మధ్య ఎగశాయి.  

జెట్‌ డౌన్‌
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో జెట్‌ ఎయిర్‌వేస్‌ దాదాపు 9 శాతం కుప్పకూలగా, కర్ణాటక బ్యాంక్‌, ఐడియా, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, ఐసీఐసీఐ ప్రు, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, చెన్నై పెట్రో, సెయిల్‌, కేడిలా హెల్త్‌ 6-2 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా మరోపక్క.. మణప్పురం, ముత్తూట్‌, ఐఆర్‌బీ, జస్ట్‌ డయల్‌, భెల్‌, బీవోబీ, శ్రీరామ్‌ ట్రాన్స్‌, హెక్సావేర్‌ 4-2 శాతం జంప్‌చేశాయి. 

స్మాల్‌ క్యాప్స్‌ డీలా
మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాటలో కదులుతున్న నేపథ్యంలో మధ్య, చిన్నతరహా షేర్లలో అమ్మకాలదే పైచేయిగా కనిపిస్తోంది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.2-0.5 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 952 నష్టపోగా.. 561 మాత్రమే లాభాతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో సర్లా పాలీ, రెలిగేర్‌, భారత్ వైర్స్‌, డెన్‌, మారథాన్‌, నహర్‌ స్పిన్నింగ్‌, క్రెడిట్‌ యాక్సెస్‌, ఓమ్‌ మెటల్స్‌, ఈఐహెచ్‌ హోటల్స్‌, మెక్‌లాయిడ్‌, 63 మూర్స్‌ తదితరాలు 8-5 శాతం మధ్య పతనమయ్యాయి.Most Popular