యస్‌ బ్యాంక్‌- ఆర్‌కేపిటల్‌.. ఓహ్‌ నో

యస్‌ బ్యాంక్‌- ఆర్‌కేపిటల్‌.. ఓహ్‌ నో

గతంలో మార్కెట్‌ ఫేవరెట్‌ కౌంటర్లుగా నిలిచిన ప్రయివేట్ రంగ సంస్థలు యస్‌ బ్యాంక్‌, రిలయన్స్ కేపిటల్‌ ఇటీవల నేలచూపులకే పరిమితమవుతున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపడంతో మరోసారి నష్టాల బాటలో సాగుతున్నాయి. ఫలితంగా 52 వారాల కనిష్టాల సమీపానికి చేరాయి. గత నెల రోజుల్లో యస్ బ్యాంక్‌ షేరు 42 శాతం దిగజారగా.. ఆర్‌కేపిటల్‌ 39 శాతం పడిపోయింది. ప్రధానంగా రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ అంశం తాజాగా ఈ రెండు కౌంటర్లపైనా ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం..

యస్‌ బ్యాంక్‌
గతేడాది(2018-19) చివరి త్రైమాసికంలో తొలిసారి నష్టాలను ప్రకటించడంతో యస్‌ బ్యాంక్‌ కౌంటర్‌ 9 ట్రేడింగ్ సెషన్లలో 34 శాతం తిరోగమించింది. క్యూ4(జనవరి-మార్చి)లో రూ. 1506 కోట్ల నికర నష్టం బ్యాంక్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. బలహీన ఫలితాల నేపథ్యంలో బ్యాంక్‌ ఔట్‌స్టాండింగ్‌ రేటింగ్‌ను  కేర్‌, ఇండియా రేటింగ్స్‌, బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ డౌన్‌గ్రేడ్‌ చేశాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో యస్‌ బ్యాంక్‌ షేరు 5.5 శాతం పతనమై రూ. 155 దిగువకు చేరింది. 

Related image

రిలయన్స్‌ కేపిటల్‌
అనిల్‌ అంబానీ గ్రూప్‌ సంస్థ రిలయన్స్‌ కేపిటల్‌ రేటింగ్‌ను ఈ నెల 4న ప్రతికూల పరిస్థితులతో కూడిన క్రెడిట్‌ వాచ్‌ స్థాయికి బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ డౌన్‌గ్రేడ్‌ చేసింది. ఆర్‌కేపిటల్‌తోపాటు.. రిలయన్స్‌ కమర్షియల్‌ ఫైనాన్స్‌, రిలయన్స్ హోమ్‌ ఫైనాన్స్‌ల లిక్విడిటీ ప్రొఫైల్‌ నీరసిస్తున్న నేపథ్యంలో రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసినట్లు బ్రిక్‌వర్క్‌ ఇప్పటికే పేర్కొంది. రెండు నెలల కాలంలో ఆర్‌కేపిటల్‌ రూ. 1800 కోట్లకుపైగా రుణాలకు చెల్లింపులను చేపట్టవలసి ఉన్నట్లు తెలియజేసింది. కాగా.. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో రిలయన్స్ కేపిటల్ షేరు దాదాపు 8 శాతం కుప్పకూలి రూ. 109 దిగువకు చేరింది. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');