ఫార్మా కంపెనీల్లోనే ఈ స్టాక్ బెస్ట్ పర్ఫార్మర్

ఫార్మా కంపెనీల్లోనే ఈ స్టాక్ బెస్ట్ పర్ఫార్మర్

దేశంలో ప్రముఖ డ్రగ్ మేకర్‌ అయిన డాక్టర్ రెడ్డీస్‌ ల్యాబ్స్ గత 12 నెలలుగా మంచి రిటర్న్స్‌ను సాధిస్తూ వస్తుంది. . అయితే డాక్టర్ రెడ్డీస్  కార్యకలాపాలు గత కొంత కాలంగా అమెరికాలో రెగ్యులేటరీ ఇబ్బందులకు గురయ్యాయి. అయినప్పటికీ...లాభదాయకత లేని పోర్ట్ ఫోలియోలను విక్రయించి , దేశీయ వ్యాపార పునరుద్ధరణ చేపట్టడంతో రెడ్డీస్ ల్యాబ్స్ గత సంవత్సర కాలంగా పుంజుకుంటుంది. 2015 నుండి అమెరికాలోని రెడ్డీస్ వ్యాపారంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అమెరికా డ్రగ్స్ కంట్రోల్ సంస్థ USFDA రెడ్డీస్ ల్యాబ్స్ మూడు ఉత్పత్తులపై నిషేధాన్ని కొనసాగించడంతో వ్యాపారంలో మందగమనం చోటు చేసుకుంది. రెడ్డీస్‌ ల్యాబ్స్ మాత్రమే కాకుండా భారతీయ డ్రగ్ మేకర్స్ సంస్థలు కూడా అమెరికాలో రేట్ల తగ్గింపు ఒత్తిళ్ళను ఎదుర్కొన్నాయి. దీంతో వాటి ఆదాయంపై గణనీయ ప్రభావం పడింది. దేశీయంగా చూస్తే.. నిఫ్టీ ఫార్మా 3.13 శాతం పెరిగిన సమయంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ గత 12 నెలల కాలంలో గరిష్టంగా 41శాతం లాభపడింది.

Image result for dr reddys labs medicine
US కు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ ఆథారిటీ (FDA) నుండి రెడ్డీస్ లాబ్స్ పలు సమస్యలను ఎదుర్కొంది. కంపెనీ మ్యాన్చుఫ్యాక్చరింగ్ ప్లాంట్లైన శ్రీకాకుళం, దువ్వాడ, మిర్యాల గూడ ప్లాంట్ల మీద క్వాలిటీ నిర్వహాణ సరిగా లేదంటూ వాటిపై నిషేధాన్ని విధించింది. మిర్యాల గూడా ప్లాంటును 2017లో తిరిగి ప్రమాణాలకనుగుణంగా తీర్చిదిద్ది ఉత్పత్తిని ప్రారంభించారు. దువ్వాడ ప్లాంటును కూడా ఈ సంవత్సరం ఫిభ్రవరిలో పునఃప్రారంభించింది రెడ్డీ ల్యాబ్స్. ఒక్క శ్రీకాకుళం ప్లాంట్ మాత్రం ఇంకా అమెరికా డ్రగ్ అథారిటీ పరిశీలనలో ఉండిపోయింది. మరోవైపు రెడ్డీస్ ల్యాబ్స్ కు చెందిన బాచుపల్లి ప్లాంట్లో కూడా ఉత్పత్తి నాణ్యతను USFDA పరిశీలిస్తూ వచ్చింది. బాచుపల్లి ప్లాంట్ గత నెల ఏప్రిల్‌లో క్లియరెన్స్ సర్టిఫికెట్‌ను పొందింది. అమెరికన్ మార్కెట్లలోని ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రెడ్డీస్ ల్యాబ్స్ పూర్తిగా దేశీయ మార్కెట్లపై దృష్టి పెట్టడంతో ఈ కంపెనీ స్టాక్స్ పుంజుకోడం మొదలుపెట్టాయి. భారత్, చైనా మార్కెట్ల నుండి వచ్చే ఆదాయం , అమెరికన్ మార్కెట్ల నుండి వచ్చే ఆదాయం కంటే ఎక్కువగా ఉండటంతో రెడ్డీస్‌ ల్యాబ్స్ లాభాల బాట పట్టింది. క్రానికల్ డిసీజెస్‌కు సంబంధించి కొత్త  డ్రగ్స్‌ను మార్కెట్లో విడుదల చేయడం కూడా రెడ్డీస్‌ లాభాలను పెంచింది. మల్టీ నేషనల్ కంపెనీలతో రెడ్డీస్ ల్యాబ్స్‌కు ఉన్న పేటెంట్ ఒప్పందాలు కూడా రెడ్డీస్ లాభాలకు దోహద పడ్డాయని ఎనలిస్టులు పేర్కొంటున్నారు.

Image result for dr reddys labs medicine

రష్యాలో బయోసిమిలర్ ప్రోడక్టుల ఉత్పత్తుల అమ్మకాలు పెరగడం, దక్షిణాసియా దేశాల్లో రెడ్డీస్ ల్యాబ్స్ తయారు చేసిన మెడిసిన్స్ కు డిమాండ్ ఉండటం వల్ల ఆదాయం పెరిగి ఈ స్టాక్స్ మరింత పుంజుకున్నాయి. అమెరికన్ మార్కెట్ల కంటే , భారత్, రష్యా , చైనా ,  ఆఫ్రికా దేశాల్లో తమ వ్యాపారం మీద దృష్టి పెట్టింది రెడ్డీస్ ల్యాబ్స్. ప్రస్తుతం దేశీయ ఫార్మా కంపెనీలు అమెరికన్ డ్రగ్ మార్కెట్లలో దారుణమైన రేట్ల యుద్ధాన్ని ఎదుర్కొంటున్నాయి. దీంతో పలు దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయం పడిపోయింది. 

Image result for dr reddys labs medicine
మరో వైపు  అంతగా లాభాలు రాని తన డెర్మటాలజీ బ్రాండ్స్ అయిన సెరినివో, ప్రోమిసెబ్, ట్రైనెక్స్ వంటి బ్రాండ్లను వదిలించుకుంది రెడ్డీస్ ల్యాబ్స్. లాభదాయకత లేని ఆస్తులను వదులుకోవడం,   హైదారాబాద్‌లోని API యూనిట్‌ అమ్మకం వంటి చర్యలతో రెడ్డీస్ ల్యాబ్స్ నష్టనివారణ చర్యలకు దిగిందని మోర్గాన్ స్టాన్లీ భావిస్తుంది. బ్రిస్టల్‌లోని యాంటీ బయాటిక్ యూనిట్, డెర్మటాలజీ బ్రాండ్ అయిన క్లోడెర్మ్ వంటి వాటిని రెడ్డీస్‌ విక్రయించింది.