ఎస్బీఐ గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు మళ్లీ తగ్గిందోచ్

ఎస్బీఐ గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు మళ్లీ తగ్గిందోచ్

ఎస్బీఐ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా రుణాలు తీసుకున్నవారందరికీ హాట్ సమ్మర్‌లో కూల్ న్యూస్ చెప్పింది. నెల రోజుల్లో వరుసగా రెండో సారి వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తన మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేట్ (ఎంసిఎల్ఆర్)ను 5 బేసిస్ పాయింట్స్‌ను తగ్గించింది. ఈ తగ్గింపు తర్వాత ఏడాది ఎంసిఎల్ఆర్ 8.5 శాతం నుంచి 8.45 శాతానికి దిగొచ్చింది. దీంతో ఈ రేట్‌ ఆధారంగా రుణాలు తీసుకున్న అన్ని అకౌంట్లలో కొద్ది మొత్తంతో ఈఎంఐ భారం తగ్గనుంది. ఈ నెల 10వ తేదీ నుంచే ఇది అమల్లోకి వస్తుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. 

నెల రోజుల్లో రెండోసారి వడ్డీ రేట్లను తగ్గించడం ఇండస్ట్రీ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కోత అత్యల్పమే అయినా దీన్ని ఎవరూ ఊహించలేకపోయారు. ఏప్రిల్ నెలలో ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష ముగిసిన వెంటనే ఎస్బీఐ 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 

హోం లోన్ తీసుకున్న వాళ్లకు ఊరట
ఏప్రిల్ 10 నుంచి ఇప్పటివరకూ విధించిన కోతల నేపధ్యంలో ఎంసిఎల్ఆర్ 15 బేసిస్ పాయింట్లు.. అంటే.. 1.5 శాతం వడ్డీ రేట్లు తగ్గినట్టు అయింది. ఇది ఖచ్చితంగా గృహరుణాలు తీసుకున్న వాళ్లకు ఎంతో లబ్ధిని చేకూరుస్తుంది. ఈఎంఐల భారం తగ్గుతుంది. 

ఎంత తగ్గుతుంది
ఉదాహరణకు మీరు రూ.25 లక్షల హౌసింగ్ లోన్‌ను 20 ఏళ్ల కాలపరిమితికి తీసుకున్నారని అనుకుందాం. ఇప్పుడు 8.5 శాతం వడ్డీతో లెక్కించడం వల్ల నెలనెలా మీరు చెల్లించాల్సిన ఈఎంఐ రూ.21,696 ఉంటుంది. అదే తాజాగా తగ్గిన 5 బేసిస్ పాయింట్లతో పోల్చిచూస్తే.. మీ ఈఎంఐ భారం రూ.21,617కి తగ్గుతుంది. అంటే నెలకు కేవలం రూ.79 మాత్రమే తగ్గినట్టు అనిపించవచ్చు. అయితే మొత్తం 20 ఏళ్ల సమయానికి ఇది మొత్తం రూ.18,970 అవుతుంది. ఈ లెక్కన ఈ 5 పాయింట్ల తగ్గింపు మీ పర్సులో రూ.19 వేలను మిగల్చబోతోంది


 Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');