నాలుగో రోజూ బేజార్‌- 70కు రుపీ

నాలుగో రోజూ బేజార్‌- 70కు రుపీ

డాలరుతో మారకంలో వరుసగా నాలుగో రోజు దేశీ కరెన్సీ నేలచూపులకు లోనవుతోంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి తొలుత 17 పైసలు(0.23 శాతం) బలహీనపడి 69.88 వద్ద ప్రారంభమైంది. తదుపరి మరింత వెనకడుగు వేసింది. ప్రస్తుతం 21 పైసలు(0.3 శాతం) క్షీణించి 69.92 వద్ద కదులుతోంది. వెరసి సాంకేతికంగా కీలకమైన 70 సమీపానికి చేరి బలహీనంగా కదులుతోంది. బుధవారం సైతం రూపాయి 28 పైసలు నీరసించి 69.71 వద్ద ముగిసింది. ఇటీవల దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో నీరసించడంతోపాటు.. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఫీఐలు) దేశీ స్టాక్స్‌ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ రావడం సెంటిమెంటును బలహీనపరచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా యూఎస్‌, చైనా మధ్య వాణిజ్య వివాదాలు తలెత్తడం కూడా దేశీ కరెన్సీని దెబ్బతీస్తున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.

Image result for FIIs selling

ఈ వారం మొదటినుంచీ
గత వారం ఆటుపోట్ల మధ్య నికరంగా 80 పైసలు ఎగసిన రూపాయి శుక్రవారాని(3)కల్లా 69.22 వద్ద ముగిసింది. అయితే ఈ వారం ప్రారంభం నుంచీ నేలచూపులతోనే కదులుతోంది. సోమవారం(6న) 18 పైసలు కోల్పోయిన రూపాయి 69.40 వద్ద ముగిసింది. తిరిగి మంగళవారం నామమాత్రంగా 3 పైసలు బలహీనపడి 69.43 వద్ద స్థిరపడింది. బుధవారం 69.74- 69.47 మధ్య కదిలి చివరికి 69.71 వద్ద స్థిరపడింది. దేశీ స్టాక్స్‌లో ఎఫ్‌పీఐలు గత నాలుగు రోజుల్లో రూ. 2,700 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టడం రూపాయిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు మార్కెట్‌ వర్గాలు తెలియజేశాయి.Most Popular