వారెన్ బఫెట్ చెప్పిన గోల్డెన్ రూల్స్... డోంట్ మిస్!

వారెన్ బఫెట్ చెప్పిన గోల్డెన్ రూల్స్... డోంట్ మిస్!

వారెన్ బఫెట్ .... గ్లోబల్ మార్కెట్లలో పరిచయం అక్కర్లేని పేరు.  స్టాక్ మార్కెట్లలో అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారుడిగా బఫెట్ ఎనలేని ఖ్యాతిని సంపాదించుకున్నారు. ఆయన వ్యూహాలు, పెట్టుబడికి మించి రాబడి సంపాదించడంలో ఆయనకు సాటి వచ్చేవారెవరూ దరిదాపుల్లో కూడా లేరని స్టాక్ ఎనలిస్టులు పేర్కొంటూ ఉంటారు. తాజాగా ఆయన ఒమహాలో నిర్వహించిన వాటాదారుల సమావేశంలో దాదాపు 40,000 మంది వాటాదారులు పాల్గొనడం ఓ సంచలనం. వారంతా వారెన్ బఫెట్ చెప్పే టిప్స్ గురించే అక్కడి వచ్చారంటే అతిశయోక్తి కాదు. ఆయన తన వాటాదారులతో పంచుకున్న విషయాలను ఆయన మాటల్లోనే చూద్దామా...!
*"నేను భవిష్యత్తులో అత్యంత ధనవంతుడిగా అవుతానని తెలుసు. ఈ ప్రయత్నంలో ఒక్క నిమిషం కూడా నేను అపనమ్మకంతో లేను"
*" మీరు ఒక సినిమాకు వెళ్ళకుండా డబ్బులను ఆదా చేయడం సరికాదు. మీ సంతోషాలను త్యాగం చేసి మరీ పొదుపు గురించి ఆలోచించడం కరెక్ట్ కాదనే నా అభిప్రాయం. ఒక సంతోషకరమైన ఆనందాన్ని అనుభూతి చెందకుండా వాయిదా వేయడం అనేది సరైన ఇన్వెస్టర్‌కు ఉండాల్సిన లక్షణం కాదు."
*" తక్కువ నష్టంతో బయట పడటం కూడా ఓ కళ "-బఫెట్ 
*మీరు నమ్మిన దాన్ని మీకంటే మరెవరూ అంత ఎక్కువగా నమ్మకూడదు. బలమైన నిర్ణయం తీసుకుంటే అంతే బలమైన విజయం మీకు దక్కుతుంది" - వారెన్ బఫెట్ 
*" విజయం ఎప్పుడూ మీ చేతుల్లోనే ఉంటుంది. కానీ దాన్ని గుర్తించలేకపోవడం నిజంగా మీ ఓటమే."- బఫెట్ 

Image result for warren buffett

"డబ్బుకు సంతోషానికి సంబంధం లేదని వారెన్ బఫెట్ అంటుంటారు. నీ జేబులో 20,000 డాలర్లు, లేదా 50,000 డాలర్లు ఉన్నప్పుడు నీవు సంతోషంగా లేకుంటే... నీ దగ్గర 5 మిలియన్ డాలర్లు ఉన్నా కూడా నీవు సంతోషంగా ఉండవని బఫెట్ పేర్కొంటారు. టన్నుల కొద్దీ నోట్ల కట్టలు మనిషిని సంతోషంగా ఉంచలేవని బఫెట్ వాదన. 
"నీ జీవనానికి, నీ కుటుంబ జీవనానికి తగినంత ఆర్ధిక భద్రత ఉంటే చాలు ..అది నీకు సంతోషాన్ని ఇస్తుంది" ,
అలాగే ఒక పని చేయాలనుకున్నప్పుడు వాయిదాలు వేయడం, లేదా ఆలస్యంగా ఆ పని వల్ల వచ్చే సంతోషాన్ని పొందడం కూడా తగదంటారు బఫెట్.

Image result for warren buffett with munger
" ఒక కంపెనీ స్టాక్స్ కొనాలంటే.. మీరు దాని గురించి పూర్తిగా తెలుసుకున్నారా లేదా అన్నది ప్రధానం "బఫెట్ 
బెర్క్ షైర్ హాత్ వే కంపెనీకి 88 ఏళ్ళ వయసు గల వారెన్ బఫెట్ ఛైర్మన్‌గా, CEOగా  కొనసాగుతున్నారు. 60 ఏళ్ళుగా తన పార్టనర్‌గా ఉన్న ముంగర్ గురించి మాట్లాడుతూ మేమిద్దరం కలిసే వ్యాపార నిర్ణయాలు తీసుకుంటామని, పెద్ద పెద్ద నిర్ణయాల విషయంలో కూలంకషంగా చర్చించే నిర్ణయాలు తీసుకున్నందువల్లే అవి విజయవంతమయ్యాయని బఫెట్ పేర్కొన్నారు.  కాగా ఒమహా లో జరిగిన వార్షిక సదస్సులో వారెన్ బఫెట్ తన వాటాదారులు, జర్నలిస్టులతో సుదీర్ఘ క్వశ్చన్‌ అండ్ ఆన్సర్స్ సెషన్‌ను నిర్వహించారు. బెర్క్ షైర్ హాత్ వే కంపెనీ పెట్టిన పెట్టుబడులు , వచ్చిన లాభాలు, రాబోయే రోజుల్లో సంస్థ కార్యచరణ వంటి పలు అంశాలపై బఫెట్ మాట్లాడారు. తన వాటాదారులకు ఓపిగ్గా విలువైన సలహాలు సూచనలను కూడా ఆయన చేశారు.