జియోతో ఢీ కొట్టేందుకు ఎయిర్‌టెల్ రెడీ చేసుకున్న సూపర్ ప్లాన్ ఇదే!!

జియోతో ఢీ కొట్టేందుకు ఎయిర్‌టెల్ రెడీ చేసుకున్న సూపర్ ప్లాన్ ఇదే!!

దేశీయ టెల్కోల విషయంలో ప్రత్యర్ధి సంస్థలకు అందనంత వేగంగా దూసుకెళ్తుంది రిలయన్స్ జియో . తక్కువ టారిఫ్‌లు, వేగవంతమైన 4G సేవలతో మిగతా టెలికాం ఆపరేటర్లకు చెమటలు పట్టిస్తుంది ముఖేష్ అంబానీకి చెందిన జియో. జియో ఇప్పటికే గత మూడు సంవత్సరాలలోనే దాదాపు 300 మిలియన్ల కస్టమర్లను సొంతం చేసుకుంది. ఇక జియోతో పోటీ పడటానికి భారతీ ఎయిర్ టెల్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కస్టమర్లను పెంచుకోడానికి, నిధుల సమీకరణ కోసం తన ఆస్తులను విక్రయానికి పెట్టాలని యోచిస్తుంది ఎయిర్ టెల్. అంతేకాకుండా రైట్స్ ఇష్యూ ద్వారా, IPO ద్వారా నిధుల సమీకరణకు యత్నాలు మొదలు పెట్టింది. ఆఫ్రికా యూనిట్‌కు సంబంధించి లండన్‌లో ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్‌కు వెళ్ళాలని అనుకుంటున్నట్టు ఎయిర్ టెల్ వర్గాలు పేర్కొన్నాయి. వందల కోట్ల రూపాయిల వ్యాపారం ఉన్న భారత టెలికాం సెక్టార్‌లో ముఖేష్ అంబానీకి చెందిన జియోను ఎదుర్కోడానికి సునీల్ మిట్టల్ సన్నాహకాలు మొదలుపెట్టారు.

Image result for reliance jio

గత నాలుగో త్రైమాసికంలో ఎయిర్ టెల్ వన్ టైమ్ లాభాలను ఆర్జించింది. రిలయన్స్ జియో మార్జిన్ల కంటే ఎయిర్ టెల్ మార్జిన్లు కాస్త పెరగడం సునీల్‌ మిట్టల్‌కు కాస్త ఊరటనిచ్చే అంశంగా మారింది.  కానీ.. ఇతర దేశాల ఆదాయం కంటే దేశీయంగా ఎయిర్ టెల్ పలు సమస్యలను ఎదుర్కొంటుంది. భారత దేశంలో మొబైల్ టారిఫ్‌ల వల్ల ఎయిర్ టెల్ కు నష్టాలే కనబడుతున్నాయి. ఇప్పటికే సంస్థ రుణ భారం 17 బిలియన్ డాలర్లకు చేరింది. మరోవైపు రానున్న కొద్ది నెలల్లో ప్రభుత్వం నిర్వహించబోయే 5G స్పెక్ట్రమ్‌ వేలం పాటలో పాల్గొనాలంటే మరిన్ని నిధులు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎయిర్ టెల్ రేటింగ్స్‌ను మూడీ సంస్థ తగ్గించడం తలనొప్పిగా మారింది. టెల్కోల పోటీ నేపథ్యంలో దేశంలో మొబైల్ టారిఫ్‌లు చాలా వరకూ దిగివచ్చాయి. ఇప్పటికే పలు సంస్థలు జియోతో సహా రానున్న రోజుల్లో రేట్లు పెంచక తప్పదని తలుస్తున్నాయి. టవర్ల నిర్వాహణ, 4G సేవా రుసుం వంటి వ్యయాలు పెరగడంతో జియో కూడా ధరలను పెంచాలని చూస్తుంది. ఒకవేళ జియో తన నెంబర్ వన్ పొజీషన్‌కు కాపాడుకోడానికి రేట్లను పెంచకపోతే.. ఎయిర్ టెల్ ఆ పోటీ వ్యాపారంలో తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి రావొచ్చు. జియో దూకుడు తట్టుకోవాలంటే.. ఎయర్ టెల్ తనకున్న ప్రస్తుత చందాదారులను కాపాడుకోవాల్సిందే. రుణ భారాన్ని తగ్గించుకోడానికి, క్రెడిట్ డౌన్‌గ్రేడ్‌ను నివారించడానికి ఈక్విటీని పెంచే యత్నాలను ఎయిర్ టెల్ చేస్తుందని టెలికాం ఇండస్ట్రీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

Image result for airtel
ఎయిర్ టెల్ సెబీకి వెల్లడించిన సమాచారం ప్రకారం వన్‌ టైం నెట్ గెయిన్ 2.020 కోట్లలో లెవీల పునఃపరిశీలన క్రెడిట్ కారణంగా మార్చ్ క్వార్టర్‌లో 1.1 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించినట్టు పేర్కొంది. గత క్వార్టర్ కంటే మొత్తం మీద  ఇది 966 కోట్ల నష్టంగానే ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. 2019 తొలి రెండు నెలల్లో ఎయిర్ టెల్ కస్టమర్లు 53,493 మంది పెరిగారని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ వెల్లడించింది . ఇదే సమయంలో జియో కస్టమర్లు 17.1 మిలియన్ల మంది పెరిగారు. 
గత ఫిబ్రవరిలో ఎయిర్ టెల్ .. 5G ఆక్షన్‌ కోసం, జియోతో పోటీ వ్యాపారం కోసం  రూ. 32,000 కోట్ల నిధుల సమీకరణకు  తన ప్రణాళికలను వెల్లడించింది. మే 17న క్లోజ్ అయ్యే రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 25,000 కోట్ల నిధులను సమీకరించాలని ఎయిర్ టెల్ భావిస్తోంది. ఒక్కో షేర్ కు రూ. 220  చొప్పున , మరియు మిగిలిన ఈక్విటీ క్రెడిట్‌లో శాశ్వత బాండ్ల విక్రయం ద్వారా నిధులను సంపాదించాలని ఎయిర్ టెల్ భావిస్తుంది. 


 tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');