ఎన్నికల ఫలితాల కంటే ముందే కొనాల్సిన స్టాక్స్ ఇవి..!

ఎన్నికల ఫలితాల కంటే ముందే కొనాల్సిన స్టాక్స్ ఇవి..!

గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు విభిన్నంగానే ప్రవర్తించాయి. స్మాల్ క్యాప్ రంగంలోని నిఫ్టీ 100 సూచీ 1.5శాతం నష్టపోయింది. నిఫ్టీ 50 కూడా ఫ్లాట్‌గా ట్రేడ్ అయ్యింది. మార్కెట్‌ క్యాప్‌లో దాదాపు 75శాతం కవర్ చేసే నిఫ్టీ 500 ఇండెక్స్ కూడా నిరాశ పూరితంగానే కనిపించింది. ఇక మార్కెట్లో వివిధ రంగాలను పరిశీలిస్తే... ఆటో రంగంలో బలహీనత కొట్టొచ్చినట్టు కనబడింది. ప్యాసింజర్ వెహికల్స్, ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్ల అమ్మకాలు గత ఏప్రిల్‌ నెలలో మందకోడిగా సాగాయి. అయినప్పటికీ ఆటో కంపెనీలు మరీ నిరాశపూరిత ప్రదర్శన చేయనప్పటికీ..గ్లోబల్ లిక్వడిటీ  వల్ల , విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహం వల్ల మార్కెట్లలో వాటి షేర్లు కాస్త నిలదొక్కుకున్నాయి. 
అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రెట్ల పెంపుపై యథాతథ స్థితి కొనసాగించడం వల్ల విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను భారత్ వంటి దేశాలకు మళ్ళించారు.  అమెరికాలో వృద్థి రేటు అంచనా 2.5 శాతం ఉండగా, అదే భారత్‌లో 7.5శాతం అంచనాలు ఉండటంతో FIIsలు దేశీయ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపుతున్నారు. దీనివల్ల రూపీ కూడా డాలర్ మారకంతో బలపడటం మొదలయ్యిందని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. 
ఇక నాన్ బ్యాంకింగ్ రంగం (NBFC) ల విషయానికి కొస్తే... రిలయన్స్ హోమ్ ఫిన్, రిలయన్స్ క్యాపిటల్స్ సంస్థలకు రేటింగ్ ఎజెన్సీస్ డీగ్రేడ్ చేయడంతో మార్కెట్లలో నాన్ బ్యాంకింగ్ సంస్థలపై మదుపర్లలో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల సమయం కావడంతో NBFC ల విషయంలో లిక్విడిటి సమస్యలపై  రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మద్దతు చర్యలు చేపట్టలేక పోయాయి. 
కేంద్రంలో ఎన్నికల ఫలితాల తరువాత సుస్థిర ప్రభుత్వం కనుక ఏర్పడితే IT, సిమెంట్, బ్యాంకింగ్ సెక్టార్లు లాభ పడొచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు. ఇప్పటికే సిమెంట్ ధరలు స్థిరంగా పెరుగుతుండటంతో ఆ కంపెనీల స్టాక్స్ లాభాల్లోకి రావొచ్చని శామ్‌కో సెక్యూరిటీస్ సంస్థ పేర్కొంది. ఆల్ట్రాటెక్ , శ్రీ సిమెంట్స్  వంటి స్టాక్స్ మంచి ప్రభావం చూపొచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థల్లో SBI మంచి బౌన్స్ బ్యాక్‌తో కనబడతోందని శామ్‌కో సెక్యూరిటీస్ భావిస్తోంది. 
ఎన్నికల ఫలితాల తరువాత స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ రంగాలు పురోగతిని చూపించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మెటల్స్ విషయంలో కమోడిటీస్ ధరలు ప్రకారం చూస్తే..అంతర్జాతీయంగా పలు కరెక్షన్లకు గురవుతున్న కారణంగా వాటి మీద పెట్టుబడులు నష్టాలనే మిగల్చవచ్చని వారు పేర్కొంటున్నారు. ఇన్వెస్టర్లు స్మాల్ క్యాప్ రంగంలోని మంచి స్టాక్స్‌ను ఎంపిక చేసుకుని మే 23 న వచ్చే ఎన్నికల ఫలితాల వరకూ అబ్జర్వ్ చేయాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రభుత్వం రానున్న 5 ఏళ్ళ కోసం స్థిరంగా ఉంచేలా ఏర్పడితే కనుక స్మాల్ క్యాప్ , మిడ్ క్యాప్ రంగాలు ఈ సారి మంచి పనితీరును కనబరుస్తాయని ఎనలిస్టులు అంటున్నారు. 

ఇక ఎన్నికల అనంతరం దలాల్ స్ట్రీట్‌లోని పలు బ్రోకింగ్ సంస్థలు, ఎనలిస్టుల అంచనాల మేరకు ఈ కింది స్టాక్స్ మంచి పనితీరును కనబరచవచ్చు..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లార్సెన్ &టుబ్రో, ICICI బ్యాంక్, భారత్ ఎలక్టానిక్స్, మారికో, KEC ఇంటర్నేషనల్, L&T ఇన్ఫోటెక్, సూర్య రోష్నీ, JK పేపర్, మహీంద్ర అండ్ మహీంద్ర, టాటా స్టీల్, ITC, వంటి స్టాక్స్ ను ఎన్నికల ఫలితాలకు మందు కొనచ్చని వారు సూచిస్తున్నారు. 
 

Disclaimer:  పైన పేర్కొన్న సలహాలు, సూచనలు ప్రముఖ మార్కెట్ విశ్లేషకులు ఇచ్చినవి మాత్రమే. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి సరిచూసుకోవాలని మనవి.