2-3 వారాల్లో మంచి లాభాలు ఇచ్చే సత్తా ఉన్న స్టాక్స్ ఇవి..!

2-3 వారాల్లో మంచి లాభాలు ఇచ్చే సత్తా ఉన్న స్టాక్స్ ఇవి..!

గత వారం దేశీయ ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు ఎరుపు రంగులో ప్రారంభమయ్యాయి. గత మంగళ వారం నాటికే ఎషియన్ మార్కెట్లు బేరిష్ సెంటిమెంట్‌తో కుదేలయ్యాయి. అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపుపై నిలుపుదల కూడా గ్లోబల్ మార్కెట్లను ప్రభావితం చేసింది. అయితే సంయుక్త ఆర్ధిక వ్యవస్థపై ఆధారపడిన అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ భవిష్యత్తు రేటు పాలసీలపై ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడంతో చైనా నుండి ఎగుమతి అయ్యే ఉత్పత్తుల డేటా మదుపర్ల సెంటిమెంట్‌ను ప్రేరేపించింది. అంతే కాకుండా దేశీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గడం,  రూపీ మారకపు విలువ కాస్త బలపడటంతో  స్టాక్ మార్కెట్లు రానున్న 2-3 వారాల్లో పుంజుకునే అవకాశం కనిపిస్తుంది.  ఎన్నికల రిజల్ట్ , మార్చ్ క్వార్టర్ ఫలితాలు , విదేశీ సంస్థాగత మదుపర్ల(FIIs)  పెట్టుబడుల ప్రవాహం వంటివి మార్కెట్లను స్థిరీకరణకు దోహద పడొచ్చు. ఈ పరిస్థితుల్లో ఎనలిస్టులు ఎలాంటి స్టాక్స్ లాభాలు తీసుకొస్తాయో అన్నదానిపై వివేక పూరిత సలహాలు ఇస్తున్నారు. అవేంటో చూద్దామా..!
రానున్న 2-3 వారాల్లో లాభాలు తీసుకొస్తాయనుకుంటున్న 11 స్టాక్స్...!

HCL టెక్నాలజీస్  / బై / టార్గెట్ ప్రైస్ రూ. 1,270/ స్టాప్ లాస్ రూ. 1,090 
జిందాల్ స్టీల్ పవర్  / బై / టార్గెట్ ప్రైస్ రూ.190 / స్టాప్ లాస్ రూ.167
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా / బై / టార్గెట్ ప్రైస్ రూ. 340-360/ స్టాప్ లాస్ రూ. 297
శంకర బిల్డింగ్ ప్రోడక్ట్స్ / బై / టార్గెట్ ప్రైస్ రూ. 590-620/ స్టాప్ లాస్ రూ. 485
అంబుజా సిమెంట్స్ / బై / టార్గెట్ ప్రైస్ రూ. 240/ స్టాప్ లాస్ రూ. 219
హెక్సావేర్ టెక్నాలజీస్ / బై / టార్గెట్ ప్రైస్ రూ. 390/ స్టాప్ లాస్ రూ. 332
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్  / బై / టార్గెట్ ప్రైస్ రూ.925 / స్టాప్ లాస్ రూ. 790
డా.రెడ్డీస్ ల్యాబ్స్  / బై / టార్గెట్ ప్రైస్ రూ.3,100 / స్టాప్ లాస్ రూ. 2,775
అరబిందో ఫార్మా  / బై / టార్గెట్ ప్రైస్ రూ.870 / స్టాప్ లాస్ రూ.820
HDFC బ్యాంక్  / బై / టార్గెట్ ప్రైస్ రూ.2,410 / స్టాప్ లాస్ రూ.2,210
అల్ట్రా టెక్ సిమెంట్  / బై / టార్గెట్ ప్రైస్ రూ.4,780 / స్టాప్ లాస్ రూ.4,450   


కాగా ఈ 11 స్టాక్స్ లోనే ఇతర  రేటింగ్ సంస్థలు , ఎస్బీఐ, జిందాల్ పవర్ కు వేరే విధంగా రేటింగ్స్ ను ఇచ్చాయి.   ఏంజిల్ బ్రోకింగ్ సంస్థ SBI  కి టార్గెట్ ప్రైస్‌గా రూ. 339, స్టాప్ లాస్ రూ. 298 గా పేర్కొంది. అలాగే HDFC సెక్యూరిటీస్ జిందాల్ స్టీల్ అండ్ పవర్‌కు టార్గెట్ ప్రైస్‌గా రూ. 190, స్టాప్ లాస్ రూ. 167గా పేర్కొన్నాయి. రానున్న రోజుల్లో ఈ 11 స్టాక్స్ అత్యుత్తమ పనితీరును కనబరచవచ్చని ప్రముఖ బ్రోకింగ్ సంస్థలు భావిస్తున్నాయి.