థ్రిల్ కోసం మార్కెట్లోకి వచ్చారా.. ! ఇలా చేస్తే లాభాలు రావొచ్చు!

థ్రిల్ కోసం మార్కెట్లోకి వచ్చారా.. ! ఇలా చేస్తే లాభాలు రావొచ్చు!

చాలా మంది ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లలో కేవలం డబ్బు సంపాదించడానికే రాలేదు. వాస్తవానికి వారిలో చాలా మంది మదుపర్లకు డబ్బు సంపాదించాలన్న ఆసక్తి కూడా లేదు.  తమ పెట్టుబడులు నష్టాల్లో ఉన్నా.. వాటిని తిరగి లాభాల బాట పట్టించడం, నష్టాల నుండి పుంజుకుని లాభార్జనను కళ్లజూడటం వంటివి వారికి బాగా కిక్ ఇస్తాయనే చెప్పొచ్చు. చేతిలో నగదు తక్కువగా ఉన్నా సరే  వారు మార్కెట్లను విపరీతంగా ప్రేమిస్తారు. తమ తెలివి తేటలను, సామర్ధ్యాన్ని , నైపుణ్యాలను మార్కెట్లలో ప్రదర్శించాలని  బలంగా కోరుకుంటారు. ట్రేడింగ్ అనే విషయాన్ని వారి సామర్ధ్యాలకు ప్రతీకగా , ఓ సర్టిఫికెట్‌లా చూస్తారు. స్టాక్ మార్కెట్లలో  ట్రేడింగ్ ద్వారా వారు ఓ థ్రిల్‌కు గురవుతారు. 
మార్కెట్లలో ఇన్వెస్టర్లు కేవలం డబ్బు సంపాదించడానికే రాకూడదని,తమ నైపుణ్యాలను, తెలివితేటలను పెంచుకోడానికి కూడా మార్కెట్లు దోహద పడతాయని ప్రముఖ ట్రేడింగ్ ఎనలిస్ట్, స్టాక్ రికమెండర్, గ్రోత్ ఎవెన్యూస్ ఫౌండర్&సీఈఓ డాక్టర్ సీ.కే. నారాయణ్ అంటున్నారు. స్టాక్ మార్కెట్లలో దాదాపు 40 దశాబ్దాల అనుభవం ఉన్న నారాయణ్ అనుభవాలను, ట్రేడింగ్‌లో ఉండే థ్రిల్స్ ను ఆయన మాటల్లోనే చదువుదామా..!

Image result for CK narayan growth avenues
" నేను ఈ స్టాక్ మార్కెట్లలోకి వచ్చి దాదాపు 4 దశాబ్దాలైంది. తొలి దశాబ్దంలో (10 ఏళ్ళలో) అదృష్టంతో నెట్టుకోచ్చాను, రెండో దశకంలో కొంత డబ్బును నష్టపోయాను, మూడో దశకంలో కాస్త పరిజ్ఞానం పెరిగి విజయవంతం అయ్యాను, నాలుగో దశకంలో గత 3 దశాబ్దాల ప్రస్థానాన్ని బేరీజు వేసుకుంటూ ఉండిపోయాను" అంటారు సీ.కే నారాయణ్‌. 
మార్కెట్లు ఎప్పుడూ నీ పెట్టుబడికి రెట్టింపు ఇస్తాయని చెప్పవు, నీవే సరైన ప్రణాళిక, ప్లాన్ తో ముందుకు వెళ్ళాలని సీకే నారాయణ్‌ పేర్కొంటూ ఉంటారు. తనతో బాటు మార్కెట్లలో ప్రవేశించిన తోటి వారు ఇదే సమయంలో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్లడంతో చాలా సార్లు అసూయకు గురయ్యానని కూడా ఆయన పేర్కొన్నారు. కానీ స్టాక్ మార్కెట్లలో లాభాలు కళ్ళ జూడాలంటే అవేవి పనికి రావని, స్టడీ, స్టేబుల్, స్పెక్యులేషన్ ఈ మూడింటి వల్లే మనకు ఓ అవగాహన ఏర్పడుతుందని నారాయణ్ తన క్లైంట్లకు చెబుతారు. 

Image result for stocks buy sell
కొంతమంది ట్రేడర్లకు విజయం మొదట్లోనే వస్తుంది. మరి కొంతమందికి ఆలస్యంగా, ఇంకొందరికి విజయం అందని ద్రాక్షే అవుతుంది. ఈ తేడాలు స్టాక్ మార్కెట్లలో ఎందుకుంటాయాని తరుచూ ప్రశ్నించుకునేవాడిని అంటారు నారాయణ్‌. 
ఈ ప్రశ్నలకు జవాబుగా నాకు తోచిందేంటంటే.. మొదటిది ట్రేడింగ్‌లో లాభనష్టాలనేవి మీరు కేటాయించే సమయం మీద ఆధారపడి ఉంటాయి. ఒక స్టాక్ మీద పూర్తి అవగాహన కల్పించుకోడానికి మీరు తగిన సమయం దానిమీద వెచ్చించాలి.పరిశోధించడాలి. దీనికి మీ సమయాన్ని పూర్తిగా కేటాయించాల్సిందే. రెండోది  మీరు తీసుకునే రిస్క్ మీద మీకు అనుమానాలు ఉండకూడదు. ఆ రిస్క్ ను కూడా ప్రేమించగలగాలి. మూడోది  మీ పెట్టుబడి లాభాల బాటలోకి ఎలా మార్చుకోవాలి, విజయవంతమైన ట్రేడర్ గా ఎలా నిలవాలి అన్న తపన ఆకలి మీకు ఉండాలి. ఆకలి గొన్న సింహంలా స్టాక్ మార్కెట్ల మీదకు దూకగలిగి ఉండాలి. పై మూడు అంశాలు మీ విజయానికి కారణాలుగా ఖచ్చితంగా మారుతాయని సీకే నారాయణ్ పేర్కొన్నారు. 

Image result for stocks buy sell
" నా కెరీర్ మొత్తంలో వందల మంది క్లైంట్స్‌తో డీల్ చేశాను. వారందరిలో నేను చూసిన కామన్ పాయింట్ ఎంటంటే.. వారెవరికీ స్టాక్ మార్కెట్లలో విజయవంతం కావడానికి సరైన ఉపాయం కానీ, సరైన ఆలోచన కానీ లేవు. వారు కేవలం విజయం అనే అలోచనను మాత్రమే కలిగి ఉన్నారు. కానీ ఆ ఆలోచన కార్యరూపం దాల్చడానికి వారి వద్ద సరైన స్ట్రాటజీ లేదు . దీనికి పరిష్కారం వారి వారి సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడమే. తమకున్న సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకున్న వారిని మాత్రమే విజయం వరిస్తుంది. మనకున్న టైమ్‌ను ప్లానింగ్, అమలు పరచడం, పరిశోధించడం వంటి అంశాల వైపు మళ్ళిస్తే.. స్టాక్ మార్కెట్లలో మీరే విజయవంతమైన ట్రేడర్లుగా నిలుస్తారు" అని అంటారు నారాయణ్. 
మార్కెట్లలో వేచి చూసే ధోరణి పనికిరాదంటారు నారాయణ్. "ఒక స్టాక్ కొనడానికి వేచి చూడటం, లేదా ఎవరో ఒకరు కొన్నాక దాని రేటు పెరుగుతుందా... లేదా అని వెయిట్ చేయడం వల్ల మన సొంత సమయం మన నుండి దూరంగా వెళ్ళిపోతుందని గుర్తు పెట్టుకోవాలి " అని అంటారు నారాయణ్. కొన్ని సమయాల్లో దూకుడు కూడా విజయాన్ని వరించేలా చేస్తుందని నారాయణ్ తన క్లైంట్లతో చెబుతుంటారు. 
క్వాంటమ్ ఫండ్‌కు చెందిన జార్జ్ సారోస్ స్టాక్స్ ఇన్వెస్టింగ్‌లో ప్రత్యేక శైలి అంటూ లేకుండా విభిన్న పద్దతుల్లో ఇన్వెస్ట్ మెంట్స్ చేస్తూ ఉంటాడు. కేవలం అవకాశ వాదిగా అతను మార్కెట్లలో సుపరిచితుడు. కానీ అతని విజయ రహస్యమేంటంటే.. ఎక్కడ లాభాలకు అవకాశం ఉందో అక్కడకు వాలిపోతాడు. రిస్క్ విషయంలో పూర్తి అవగాహన కలిగి ఉండటం జార్జ్ సారోస్ ప్రత్యేకత. రిస్క్ తో ఒక ఆరోగ్యకరమైన  రిలేషన్ మెయిన్ టేన్ చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్యలా కనబడుతుంది. దీనివల్ల వారి బెట్స్ పరిమాణం విషయంలో వారు పూర్తి అవగాహనతో ఉంటారు, లాభాలు కూడా అదే స్థాయిలో అందుకుంటారని నారాయణ్ ఉదాహరణగా పేర్కొంటారు.  

Image result for buy low sell high
" Buy low and sell high " ఈ సూత్రం విజయానికి చేరువ చేస్తుందని నారాయణ్‌ బలంగా నమ్ముతారు. తక్కువ వాల్యూమ్‌లో కొనడం, హై వాల్యూమ్స్ లో అమ్మడం అనేది మనకున్న సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసినపుడే సాధ్యమౌతుందని నారాయణ్ పేర్కొంటారు. రిస్క్ అన్న విషయాన్ని ఎప్పుడూ పెంచుకోకూడదని, రిస్క్ ను ఎప్పుడూ తగ్గించుకోవడం లేదా కనిష్టానికి పరిమితం చేయడం చాలా ముఖ్యమని నారాయణ్‌ ఇన్వెస్టర్లకు సలహా ఇస్తారు. గుణాత్మక రిస్క్‌లు తీసుకోడం, అర్ధవంతమైన బెట్స్ కొనసాగించడం మదుపర్లకు మంచి థ్రిల్‌ను కలిగిస్తుందని నారాయణ్ పేర్కొంటున్నారు. మరి మీరు ఎలాంటి ట్రేడర్‌గా మారాలనుకుంటున్నారు..? సమయం చాలా విలువైనది కదా..!