ఇన్నేళ్లకు... ఆ స్టాక్ కొన్న వారెన్ బఫెట్ !

ఇన్నేళ్లకు... ఆ స్టాక్ కొన్న వారెన్ బఫెట్ !

ప్రముఖ గ్లోబల్ దిగ్గజం , బెర్క్ షైర్ హాత్ వే అధినేత వారెన్ బఫెట్ స్టాక్ మార్కెట్ల రంగంలో అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్‌గా సుపరిచితులు. ఎన్నో విజయవంతమైన స్టాక్స్ ను ఎంపిక చేసుకునే వారెన్ బఫెట్ ప్రస్తుత కాలంలో అమెజాన్ స్టాక్స్ ను మాత్రం ఇంతవరకూ కొనలేదు. ఇది ప్రముఖ మార్కెట్ ఎనలిస్టులను ఆశ్చర్య పరిచేది. తాజాగా వారెన్ బఫెట్ తన హాత్ వే ఇన్‌కార్పోరేషన్ ద్వారా అమెజాన్.కామ్  స్టాక్స్ ను కొనుగోలు చేసినట్టు సమాచారం. బఫెట్ మాత్రం ఈ స్టాక్స్ కొనుగోలు తన ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్లు టాడ్ కాంబ్స్, లేదా టెడ్ వెస్లర్ ద్వారా జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు. ఈ వివరాలు US స్టాక్‌ హోల్డింగ్స్ త్రైమాసిక రిపోర్ట్‌లో వెల్లడయ్యాయి. కాగా వారెన్ బఫెట్ అమెజాన్ స్టాక్స్ కొనుగోలు ద్వారా యూటర్న్ తీసుకున్నారని, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ నాయకత్వాన్ని ప్రశంసించినట్టైందని గ్లోబల్ ఎనలిస్టులు భావిస్తున్నారు. " అవును..! నేను జెఫ్ బెజోస్‌కు పెద్ద అభిమానిని. ఇప్పటి వరకూ ఆ స్టాక్స్ నేను కొననందుకు చింతిస్తున్నాను " అని వారెన్ బఫెట్ CNBC కి ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు. కాగా ఈ స్టాక్స్ కొనుగోలుపై ఇంతవరకూ అమెజాన్ డాట్ కామ్ స్పందించకపోవడం విశేషం. కాగా బెర్క్ షైర్ హాత్ వే దాదాపు 90 వ్యాపారాలను నిర్వహిస్తుంది. ఇన్సూరెన్స్, ఎనర్జీ, ఫుడ్, రిటైల్, ఇండస్ట్రియల్, రైల్ రోడ్, వంటి వివిధ రంగాల్లో తన వాటాలను విస్తరించింది. ప్రస్తుతం అమెజాన్‌ స్టాక్స్ కొనుగోలు ద్వారా వారెన్ బఫెట్, జెఫ్ బెజోస్ మధ్య  ఓ బంధం ఏర్పడినట్టైంది. ఇప్పటికే వీరిరువురు సంయుక్తంగా జేపీ మోర్గాన్ చేజ్ కంపెనీతో కలిసి "హెవెన్" పేరిట జాయంట్ వెంచర్‌ను ప్రారంభించారు. ఉద్యోగుల ఆరోగ్య సమస్యలు, హెల్త్ ఖర్చులను నియంత్రిచడానికి ఈ హెవెన్ పనిచేస్తుంది. కాగా ఈ శనివారం వారెన్ బఫెట్ మరియు బెర్క్ షైర్ హాత్‌వే వైస్ ఛైర్మన్ ఛార్లీ ముంగర్ షేర్ హోల్డర్స్ మీటింగ్‌ను నిర్వహించనున్నారు. సుమారు 40,000 మంది షేర్ హోల్డర్స్ ప్రశ్నలకు వారు సమాధానం ఇవ్వనున్నారు. 

Image result for amazon logoImage result for warren buffett