సూపర్ హీరోలు నేర్పిస్తున్న ఇన్వెస్ట్‌మెంట్ టిప్స్

సూపర్ హీరోలు నేర్పిస్తున్న ఇన్వెస్ట్‌మెంట్ టిప్స్

అవెంజర్స్.. ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తున్న సెన్సేషనల్ సినిమా. సుమారు రూ.15 -20 వేల కోట్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టాలని చూస్తున్న ఈ సినిమా మొదటి రోజు నుంచే రికార్డ్ స్థాయిలో వసూళ్లు చేస్తోంది. అయితే ఈ సినిమాను కేవలం ఫన్ కోసం చూడకుండా ఇందులో నుంచి కూడా మనం కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ పాఠాలను నేర్చుకోవచ్చు. ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, బ్లాక్ విడో దగ్గరి నుంచి యాంట్ మ్యాన్ వరకూ ప్రతీ ఒక్కరూ మనకో పాఠాన్ని బోధిస్తారు. చూడండి.. చదవండి.. నేర్చుకోండి...

బ్లాక్ పాంథర్


వాకండాకు రాజు, సంరక్షుడైన టి చల్లా.. ఓ సూపర్ హీరో. తనో బ్లాక్ పాంథర్. మార్వెల్ హీరోస్‌లో ఓ ఐకానిక్ క్యారెక్టర్. అలాంటి చల్లా సామ్రాజ్యంలో కుప్పలుతెప్పలుగా వైబ్రానియం నిల్వలు ఉంటాయి. అతని తల్లిదండ్రులు కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ అని పిలవొచ్చు. ఎందుకంటే వాళ్ల మరణం తర్వాత కూడా ఆర్థికంగా బ్లాక్ పాంథర్‌కు ఎలాంటి ఇబ్బందీ కలుగలేదు. 

ఏం నేర్చుకోవాలి - మంచి ఎస్టేట్ ప్లానింగ్. తమ తర్వాతి తరానికి తమ ఆస్తుల గురించి, వాటిని కాపాడుకోవడం గురించి ముందే నేర్పించారు. తమ ఆస్తులను తర్వాతి తరానికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా బదలాయించేశారు. 

థోర్


రాజవంశీయుడైన కింగ్ ఓడిన్‌కు పుట్టిన సంతానమే థోర్. అస్గార్డ్‌లో నివసించిన వీళ్లకు డబ్బుకు ఎలాంటి లోటూ లేదు. సకల భోగాలతో తులతూగిన థోర్‌.. తన హ్యామర్‌ ఆయుధాన్ని పోగొట్టుకునేంత వరకూ ఎలాంటి ఇబ్బందీ కలుగలేదు. తన చెల్లి హెల్లాను తక్కువ అంచనా వేసి ఇబ్బందులు పాలైన థోర్.. తన ఆయుధాన్ని పోగొట్టుకుంటాడు. ఈ ఊహించిన పరిణామం థోర్ జీవితాన్ని మార్చేసింది. తన చెల్లిని పూర్తిగా నమ్మడమే ఇందుకు కారణమైంది.

ఏం నేర్చుకోవాలి - పెట్టుబడి పెట్టే ముందు ఆఫర్ డాక్యుమెంట్స్‌ను పూర్తిగా, శ్రద్ధగా చదవాలి. 

ఐరన్ మ్యాన్ 

ఒక్క సారిగా డబ్బులు కుమ్మరించడకుండా ... ఒక్కో అడుగు ఎక్కుతూ ముందుకు సాగాలనేది ఐరన్ మ్యాన్ వ్యూహం. టోనీ స్టార్క్‌ను చూసి మనం ఇదే నేర్చుకోవాలి. తన బాడీ ఆర్మర్‌ను ఎప్పుడూ ఒక్కటి మాత్రమే తయారు చేసుకోలేదు టోనీ. ఎప్పుడూ మూడు ఆర్మర్స్ సిద్ధంగా ఉంటాయి. గతంలో తయారు చేసిన మార్క్ 1 కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే పనిచేసేది. దాన్ని ట్రయర్ అండ్ ఎర్రర్ మెథడ్ కింద పూర్తిస్థాయిలో డెవలప్ చేసుకుంటూ వెళ్లి సక్సెస్ అయ్యాడు టోనీ. టెక్నాలజీని పూర్తిస్థాయిలో వాడుకున్నాడు. 

ఏం నేర్చుకోవాలి - ఎప్పుడూ ఒక్క ఆదాయాన్నే నమ్ముకోవద్దు. రిస్క్ డైవర్సిఫై చేసుకోవాలి. టెక్నాలజీని ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి.. అప్‌డేట్ కావాలి. 

యాంట్ మ్యాన్


ఒక్కోసారి సైజ్ మ్యాటర్ కాకపోవచ్చు. స్మాల్ మే బి పవర్‌ఫుల్. అది యాంట్ మ్యాన్‌కు బాగా సూటవుతుంది. అందుకే మనకు తెలియకుండానే మన సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్, రికరింగ్ డిపాజిట్లు కూడా అనుకోని సమయాల్లో అక్కరకు రావొచ్చు. 

ఏం నేర్చుకోవాలి - ఒకే సారి లక్ష రూపాయల పెట్టుబడి అసాధ్యం కావొచ్చు. అదే సమయంలో నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు పెద్దగా కష్టం కాకపోవచ్చు. అయితే క్రమం తప్పకుండా క్రమశిక్షణ ముఖ్యం. 

బ్లాక్ విడో


నటాషా రొమనోఫ్.. మాజీ రష్యన్ స్పై. తన ఫ్లెక్సిబులిటీ, ఆటగాళ్లకు ఉంటే వేగం, దూసుకుపోయే తత్వం తన ప్లస్ పాయింట్స్. 

ఏం నేర్చుకోవాలి - ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. కేవలం స్టాక్ మార్కెట్ల, కేవలం ఫిక్సెడ్ డిపాజిట్.. అని గిరిగీసుకుని కూర్చుకోండా అవసరాన్ని, అవకాశాన్ని బట్టి మనం మారుతూ ఉండాలి. 

స్పైడర్ మ్యాన్


స్పైడర్ మ్యాన్ ఓ సూపర్ హ్యూమన్. తనకు అమితమైన శక్తులున్నాయి. తన బలానికి తోడు.. స్పైడీ.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త బలమైన మెకానికల్ వెబ్ షూటర్స్‌ను తయారు చేసుకుంటూ ఉంటాడు. ఎంత శక్తి ఉన్నా.. రోప్స్ లేకుంటే మాత్రం స్పైడీ.. ఎక్కువ దూరం ప్రయాణించలేడు. 

ఏం నేర్చుకోవాలి - ఫైనాన్షియల్ అడ్వైజర్‌ సహకారం తీసుకున్నా.. పూర్తిగా అతనిపైనే ఆధారపడొద్దు. మనం కూడా మెల్లిగా నేర్చుకోవడం మొదలుపెట్టాలి. మన పెట్టుబడి సాధనాలపై అవగాహన పెంచుకోవాలి. 

హల్క్


బలం.. బుద్ధి అతని సొంతం. వాస్తవానికి ఇదో సూపర్ క్వాలిటీ. రెండూ ఒకే వ్యక్తికి  ఉండడం అంత సులువైన విషయం కాదు. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే చాలాసార్లు హల్క్ ఈ విషయంలో ఫెయిల్ అయ్యాడు. ఇబ్బందుల పాలయ్యాడు. 

ఏం నేర్చుకోవాలి - పోర్ట్‌ఫోలియోను బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒకే పెట్టుబడి సాధనంలో పూర్తిగా పెట్టుబడులు, ఒకే అంశంపై ఎక్కువగా దృష్టి పెట్టడం కూడా ఏ మాత్రం మంచిది కాదు. 

పూర్తిగా చదివాక.. (Finally what to learn...)
ఇవన్నీ మనకు అవసరమా.. ఇందులో ఏముంది అని అనుకోవచ్చు. వీళ్లంతా గ్రేట్ మార్వెల్ క్యారెక్టర్స్. కనీసం మనకు కనెక్ట్ కాకపోయినా.. మన తర్వాతి తరానికైనా వీటి గురించి అవగాహన ఉంటుంది. వాళ్లకు ఈ భాషలో చెబితే ఇంకా ఈజీగా కనెక్ట్ అవుతారు. రేపటి రోజును అందంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తారు.