7 నెలల్లో ఈ స్టాక్ 107 శాతం జంప్... ఇంకెంత పెరుగుతుందో ?

7 నెలల్లో ఈ స్టాక్ 107 శాతం జంప్... ఇంకెంత పెరుగుతుందో ?

ఆ స్టాక్ మీద ఎవరికి పెద్దగా అంచనాలు లేవనే చెప్పాలి. మిడ్ క్యాప్ రంగంలో నష్టభయాలు ఎక్కువ కావడంతో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ రంగాల్లో మదుపర్లు నష్టాలనే ఎక్కువగా చవిచూశారు. కానీ..అనూహ్యంగా ఒక స్టాక్ మాత్రం గత 7 నెలల్లో దాదాపు 107శాతం పెరిగి సంచలనం సృష్టించింది.18 నెలల గరిష్టంతో 2శాతం పెరిగి రూ. 157 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆ స్టాకే బలరాం పూర్ చిన్ని మిల్స్ . నేటి శుక్రవారం నాటి మార్కెట్లలో బలరాం పూర్ చిన్ని స్టాక్స్ ఆల్‌టైం గరిష్టానికి చేరువలోకి చేరుకుంది. 2017 డిసెంబర్ 6 నుండి చూస్తే.. ఈ స్టాక్‌ హైయెస్ట్ లెవల్‌లో ట్రేడ్ అవుతూ వస్తుంది. షుగర్ రంగంలో అధిక లాభార్జనకు అవకాశాలు పెరగడం, మద్దతు ధర కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు బలరాం పూర్ చిన్ని స్టాక్స్ బలోపేతం కావడానికి దోహద పడ్డాయి. అంతే కాకుండా గత నెలలో కంపెనీ టోటల్ ఈక్విటీలో 3.69శాతం షేర్లను అంటే దాదాపు 8.44 మిలియన్  ఈక్విటీ షేర్లను బైబ్యాక్ చేయడానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఒక్కో షేర్ రూ. 175 చొప్పున టెండర్ ఆఫర్‌ను పిలిచింది బలరాంపూర్ చిన్ని మిల్స్. కంపెనీ ఇప్పటికే వాటా పునర్‌కొనుగోలు కోసం ఏప్రిల్ 16 2019 వరకూ వ్యవధిని పెంచుకుంది. 

Image result for balrampur chini mill
డిసెంబర్ 31, 2019 నాటికి కంపెనీ ఆపరేటింగ్ ఇన్‌కం రూ. 2,958 కోట్లుగా నమోదు చేసింది. అలాగే ఆపరేటింగ్ మార్జిన్లు 14.5శాతం వృద్ధితో రూ. 3,317కోట్లను ఆర్జించింది. డిస్టిలరీ సెగ్మెంట్‌లో ఈ ఆపరేటింగ్ మార్జిన్ల పెరుగుదలతో కంపెనీ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్‌ను చూపించినట్టైంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇథనాల్  రేట్లను పెంచడంతో బలరాంపూర్ చిన్ని మిల్స్ స్టాక్స్ లాభపడిందని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఇథనాల్ రేట్లను ప్రభుత్వం పెంచడంతో డిస్టిలరీ రంగంలో లాభదాయకత ఎక్కువగా ఉంటుందని ప్రముఖ రేటింగ్ ఎజెన్సీ క్రిసిల్ (CRISIL) పేర్కొంది. డిస్టిలరీ మరియు కోజనరేషన్ పనితీరుతో హైయ్యర్ వాల్యూమ్స్ పెరిగాయని కంపెనీ మేనేజ్ మెంట్ పేర్కొంది. దీంతో బలరాం పూర్ చిన్ని తన ఇథనాల్ ప్లాంట్‌ అయిన గులారియాలో డిస్టిలరీ కెపాసిటీని పెంచే చర్యలను తీసుకొంది.  గులారియా ప్లాంట్ కెపాసిటీ పెరిగితే మరిన్ని లాభాలను ఆర్జించవచ్చు. కంపెనీ నిర్వాహణ, సామర్ధ్యం, లాభాల ఆర్జనను పరిశీలించిన రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్  బలరాంపూర్ చిన్ని మిల్స్ కు AA, A1+ రేటింగ్స్ ను ఇచ్చింది. ఈ రేటింగ్స్ వల్ల ఉత్తర భారత దేశంలో సంస్థ యొక్క ఆధిపత్య మార్కెట్‌కు దోహదం చేస్తుంది. రైతులతో సంబంధాలు, రాబడి, ఆపరేటింగ్ సామర్ధ్యాలను పెంచుకోడానికి మరియు ఫైనాన్షియల్ రిస్కులను తగ్గించుకోడానికి కారకం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 
కాగా బలరాం పూర్ చిన్ని మిల్స్ స్టాక్స్ ముందు ముందు మరింత పెరగొచ్చని, ఎన్నికల రిజల్ట్ తరువాత సుస్థిర ప్రభుత్వం ఏర్పడ్డాక మార్కెట్లు మరింత వేగంగా పుంజుకునే అవకాశం ఉంది . అలాగే సుగర్ పరిశ్రమ ప్రస్తుతం ఉచ్ఛస్థితిలో ఉండటం కూడా బలరాం పూర్ చిన్ని వంటి స్టాక్స్ కు మేలు కలిగించేవని మార్కెట్ ఎనలిస్టులు భావిస్తున్నారు. 

Image result for balrampur chini mill