4 నెలల్లో రూ.150 కోట్ల బొనాంజా.. ! ఓ ఇన్వెస్టర్ సూపర్ సక్సెస్ స్టోరీ!

4 నెలల్లో రూ.150 కోట్ల బొనాంజా.. ! ఓ ఇన్వెస్టర్ సూపర్ సక్సెస్ స్టోరీ!

సాధారణంగా స్టాక్ మార్కెట్లలో సింగిల్ ఇన్వెస్టర్లు పెద్దగా లాభపడిన దాఖలాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ దలాల్ స్ట్రీట్‌లో కేవలం 4 నెలల్లో రూ. 150 కోట్లు సంపాదించిన ఘనత ఒకే ఒక్కడికి దక్కుతుంది. ఇండివిడ్యుల్ ఇన్వెస్టర్లలకు  షేర్ బజార్ ఎప్పుడూ లాభాలను పెద్ద మొత్తంలో చూపించలేదని ఎనలిస్టులు చెబుతుంటారు. కానీ.. అనిల్ కుమార్ గోయెల్ విషయంలో అది తప్పని రుజువైంది. దేశీ స్టాక్ మార్కెట్లలో అత్యంత విజయవంతమైన ఇండివిడ్యుల్ ఇన్వెస్టర్ అనిల్ కుమారే అని ఏస్‌ ఈక్విటీ పేర్కొంది. ఏస్ ఈక్విటీ డేటా బేస్ వివరాల ప్రకారం అనిల్ కుమార్ గోయెల్  పోర్ట్ ఫోలియో విలువ గత నెల ఏప్రిల్ 25 వరకూ  సుమారు రూ. 970 కోట్లకు చేరుకుంది.  2019 జనవరిలో ఈ పోర్ట్ ఫోలియో విలువ రూ. 815 కోట్లుగా ఉంది. అంటే కేవలం 4 నెలల లోపే అనిల్ రూ. 150 కోట్ల సంపదను పెంచుకున్నారు. 
లాభాలను తీసుకొచ్చిన స్మాల్ క్యాప్, షుగర్ స్టాక్స్  
అనిల్ పోర్ట్ ఫోలియోలో దాదాపు 35 స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయి. ఏప్రిల్ 25 నాటికి దేశీ స్టాక్ మార్కెట్ల ర్యాలీ కొనసాగింది. BSE సెన్సెక్స్ 7 శాతం పెరిగి 2,500 పాయింట్ల వృద్ధితో 38,730 కి చేరుకుంది. ఇదే సమయంలో అనిల్ కుమార్ పోర్ట్ ఫోలియో లోని  సుగర్, ఆటో ఉపకరణాలు, కన్జ్యూమర్ గూడ్స్, టెక్స్ టైల్స్, స్టీల్ సెక్టార్  లోని స్టాక్స్ బాగా లాభాలను ఆర్జించాయి. అయితే ఇదే సమయంలో  BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 2శాతం నష్టపోయినప్పటికీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.50శాతం లాభపడటం విశేషం. గత మూడు నెలల కాలంలో అనిల్ కుమార్ గోయెల్, అవథ్ షుగర్ & ఎనర్జీ, త్రివేణీ ఇంజనీరింగ్, ఉత్తమ్ షుగర్ మిల్స్ వంటి స్టాక్స్ లో పెట్టుబడులను పెంచారు. ఇవి దాదాపు 42శాతం ర్యాలీ చేయడంతో అత్యధిక లాభాలను ఆర్జించారు. షుగర్ రంగంలో ప్రభుత్వ మద్దతు చర్యలు , బ్రెజిల్‌లో షుగర్ ఉత్పత్తి తగ్గిపోవడం, దేశీయ షుగర్ పరిశ్రమకు కలిసి వచ్చాయి. దీంతో షుగర్ రంగంలోని స్టాక్స్ మంచి పనితీరును కనబరిచాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఇక అనిల్ కుమార్ గోయెల్ పోర్ట్ పోలియోలోని  మెజిస్టిక్ ఆటో  స్టాక్స్ జనవరి 1 వతేదీన రూ. 89.10గా ఉండగా , అక్కడి నుండి ఏప్రిల్ 25 నాటికి దాదాపు రెట్టింపు అయ్యి రూ. 207.10 వద్ద ట్రేడ్ అయింది. బాసుమతి బియ్యం ప్రాసెసింగ్ కంపెనీ అయిన KRBL  స్టాక్స్ కూడా ఈ 3 నెలల కాలంలో 24శాతం వృద్ధిని కనబరిచాయి. ఈ స్టాక్స్ లో గోయెల్ 4.12శాతం పెట్టుబడులను ఉంచారు.
అమర్‌ జ్యోతీ స్పిన్నింగ్ మిల్స్ లోని తన వాటాలను 3.24 నుండి 3.26 వరకూ పెంచారు అనిల్ కుమార్.  
మార్చ్ నెల ముగిసే సరికి అనిల్ తన పోర్ట్ ఫోలియో లోని సామ్ టెక్స్ ఫ్యాషన్స్, శ్రీకాళహస్తి పైప్స్ వంటి స్టాక్స్ ను విక్రయించారు. ఉత్తమ్ షుగర్స్ మిల్స్, ధమ్ పుర్ షుగర్ మిల్స్, మజ్డా, ద్వారకేష్ షుగర్స్, అవథ్ షుగర్స్ , సంఘ్వీ మూవర్స్ , KG డెనిమ్ , వర్ధమాన్ స్పెషల్ స్టీల్స్ వంటి స్టాక్స్ లో తన పెట్టుబడులను పెంచారు అనిల్ కుమార్. ఈ స్టాక్స్ అన్నీ 2019 తొలి క్వార్టర్‌ కల్లా 4శాతం నుండి 42శాతం పెరిగిన స్టాక్స్ కావడం గమనార్హం. 
ఇంకా ఓమాక్స్ , పనామా పెట్రోకెమ్, కాస్మో ఫిల్మ్స్ , అడోర్ ఫోన్ టెక్ , సౌత్ ఇండియా పేపర్ మిల్స్ , స్వెలెక్ట్  టూల్స్ , తిరుమలై కెమికల్స్ , స్టార్ పేపర్ , సరళా పెర్ఫార్మెన్స్ ,IG పెట్రో కెమికల్స్ వంటి స్టాక్స్ దాదాపు 30శాతం పెరిగి అనిల్ కుమార్ పోర్ట్ ఫోలియోలో సంపదను మరింత పెంచాయి.