హిందాల్కో జోరు- ఎంఆర్ఎఫ్‌ కుదేల్‌

హిందాల్కో జోరు- ఎంఆర్ఎఫ్‌ కుదేల్‌

తెలంగాణలోని కొల్లూరులోగల ప్లాంటును స్లంప్‌ సేల్‌ పద్ధతిలో విక్రయించినట్లు వెల్లడించడంతో ఆదిత్య బిర్లా గ్రూప్‌ దిగ్గజం హిందాల్కో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఈ కౌంటర్ జోరందుకుంది. కాగా.. మరోపక్క గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్న టైర్ల తయారీ దేశీ దిగ్గజం ఎంఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌ కౌంటర్లో ఇన్వెస్టర్లు అమ్మకాలవైపు మొగ్గుచూపుతున్నారు. వివరాలు చూద్దాం..

హిందాల్కో ఇండస్ట్రీస్‌
తెలంగాణలోని కొల్లూరు ప్లాంటును యథాథతంగా ముంధ్రా అలూఫోయిల్‌కు విక్రయించినట్లు హిందాల్కో ఇండస్ట్రీస్‌ తాజాగా వెల్లడించింది. అల్యూమినియం ఫాయిల్స్‌ తయారు చేసే ఈ ప్లాంటును స్లంప్‌ సేల్‌ పద్ధతిలో ముంధ్రాకు విక్రయించినట్లు వివరించింది. కాగా.. 2016 మార్చి నుంచీ ఈ ప్లాంటులో కార్యకలాపాలను నిలిపివేసినట్లు హిందాల్కో తెలియజేసింది. దీంతో ప్లాంటు విక్రయం కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావాన్నీ చూపబోదని తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్ఈలో హిందాల్కో షేరు 2.5 శాతం ఎగసి రూ. 201.5కు చేరింది. హిందాల్కోలో ప్రమోటర్లకు ప్రస్తుతం 34.66% వాటా ఉంది.

Image result for MRF Ltd

ఎంఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌
గత మూడు వారాలుగా నీరసంగా కదులుతున్న ఎంఆర్ఎఫ్‌ లిమిటెడ్‌ కౌంటర్లో మరోసారి అమ్మకాలు తలెత్తాయి. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఎంఆర్‌ఎఫ్‌ షేరు  2 శాతం క్షీణించి రూ. 54,300కు చేరింది. తొలుత రూ. 54,250 వరకూ వెనకడుగు వేసింది. ఇటీవల ఈ కౌంటర్ నేలచూపులకు లోనవుతోంది. గత మూడు వారాల్లో 10 శాతం నష్టపోయింది. ఫలితంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదైన 52 వారాల కనిష్టం రూ. 53,901కు చేరువలో నిలిచింది. కాగా.. గతేడాది క్యూ4(జనవరి-మార్చి) ఫలితాలను వచ్చే వారం(మే 2న) ప్రకటించనుంది.Most Popular