ర్యాలీస్‌ డౌన్‌- సీజీ పవర్‌ ప్లస్‌

ర్యాలీస్‌ డౌన్‌- సీజీ పవర్‌ ప్లస్‌

గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు నిరాశ పరచడంతో టాటా గ్రూప్‌ సంస్థ ర్యాలీస్‌ ఇండియా కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోపక్క బిలియనీర్‌ సునీల్‌ మిట్టల్‌ అదనపు వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సొల్యూషన్స్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వివరాలు చూద్దాం..

ర్యాలీస్‌ ఇండియా
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ర్యాలీస్ ఇండియా లిమిటెడ్‌ నికర లాభం 93 శాతం పడిపోయి రూ. 1.3 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం స్వల్పంగా క్షీణించి రూ. 351 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ర్యాలీస్‌ ఇండియా షేరు 5 శాతం పతనమై రూ. 150 వద్ద ట్రేడవుతోంది. 

Related image

సీజీ పవర్‌
పారిశ్రామికవేత్త సునీల్‌ మిట్టల్‌ సీజీ పవర్‌ కంపెనీలో అదనపు వాటాను కొనుగోలు చేసినట్లు ఎన్‌ఎస్‌ఈ డేటా వెల్లడించింది. ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా 44.6 లక్షల షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. దీంతో సునీల్‌ మిట్టల్‌ వాటా సీజీ పవర్‌లో 6 శాతానికి చేరింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో సీజీ పవర్ షేరు 1.5 శాతం పుంజుకుని రూ. 40 వద్ద ట్రేడవుతోంది. గత మూడు రోజుల్లో ఈ షేరు 17 శాతం పురోగమించింది. కాగా.. మిట్టల్‌ గత నెల 11- ఈ నెల 23 మధ్య కాలంలో సీజీ పవర్‌కు చెందిన 3.3 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. ఇది 5 శాతం వాటాకు సమానం.Most Popular