ఎంసీఎక్స్‌ భళా- డీమార్ట్‌ డీలా 

ఎంసీఎక్స్‌ భళా- డీమార్ట్‌ డీలా 

గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌(ఎంసీఎక్స్‌) షేరు జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ కౌంటర్‌ లాభాలతో కళకళలాడుతోంది. కాగా.. మరోపక్క విదేశీ బ్రోకింగ్ దిగ్గజం క్రెడిట్‌ స్వీస్‌ షేరు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడంతో డీమార్ట్‌ స్టోర్ల నిర్వహణ సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. వివరాలు చూద్దాం..

ఎంసీఎక్స్‌ లిమిటెడ్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఎంసీఎక్స్‌ లిమిటెడ్‌ నికర లాభం 78 శాతం జంప్‌చేసి రూ. 61 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 12 పెరిగి రూ. 79 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఇబిటా 10 శాతం పుంజుకుని రూ. 25 కోట్లను అధిగమించింది. మార్జిన్లు 32.4 శాతం నుంచి 31.7 శాతానికి స్వల్పంగా బలహీనపడ్డాయి. వాటాదారులకు షేరుకి రూ. 20 డివిడెండ్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎంసీఎక్స్‌ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 833 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 843ను సైతం అధిగమించింది. 

Related image

ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌
ఇతర కంపెనీల నుంచి పోటీ పెరుగుతున్న నేపథ్యంలో డీమార్ట్‌ షేరు అండర్‌పెర్ఫార్మ్ చేయవచ్చని విదేశీ రీసెర్చ్‌ దిగ్గజం క్రెడిట్‌ స్వీస్‌ తాజాగా పేర్కొంది. దీంతో ఈ కౌంటర్‌ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేస్తూ రూ. 1150 టార్గెట్‌ ధరను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో డీమార్ట్‌ షేరు 2 శాతం క్షీణించి రూ. 1301 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1297 వరకూ నీరసించింది. ప్రధానంగా రిలయన్స్ రిటైల్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో డీమార్ట్‌కు పోటీ పెరగనున్నదని క్రెడిట్‌ స్వీస్‌ అభిప్రాయపడింది. కాగా.. ఇటీవల  మార్జిన్లపై ఒత్తిడి పడవచ్చన్న అంచనాలతో ఈ కౌంటర్‌ బలహీనంగా కదులుతూ వస్తున్న విషయం విదితమే. గత రెండు వారాల్లో ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ షేరు 14 శాతం క్షీణించడం గమనార్హం.Most Popular