క్యూ4 -సైయెంట్‌ -టాటా స్టీల్‌ జూమ్‌

క్యూ4 -సైయెంట్‌ -టాటా స్టీల్‌ జూమ్‌

గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు ఆకట్టుకోవడంతో ఓవైపు టెక్నాలజీ రంగ హైదరాబాద్‌ సంస్థ సైయెంట్‌ లిమిటెడ్‌.. మరోపక్క మెటల్‌ రంగ దిగ్గజం టాటా స్టీల్‌ కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

సైయెంట్‌
ఇంజినీరింగ్‌ సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ సైయెంట్‌ లిమిటెడ్‌ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో రూ. 176 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది క్యూ4తో పోలిస్తే ఇది 90 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం మాత్రం 2 శాతం క్షీణించి రూ. 1,163 కోట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో సైయెంట్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 5.2 శాతం జంప్‌చేసి రూ. 615 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 637 వరకూ ఎగసింది.

Related image

టాటా స్టీల్‌ 
గతేడాది చివరి క్వార్టర్‌(జనవరి-మార్చి)లో టాటా స్టీల్‌ రూ. 2295 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 14,688 కోట్ల నికర లాభం నమోదైంది. దీనిలో రూ. 11,376 కోట్లమేర వన్‌టైమ్‌ లాభం కలసి ఉండటం గమనార్హం! కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 26 శాతం పుంజుకుని రూ. 42,423 కోట్లను తాకింది. కాగా.. నిర్వహణ లాభం(ఇబిటా) 17 శాతం ఎగసి రూ. 7513 కోట్లను అధిగమించింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం టాటా స్టీల్‌ షేరు దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 535 వద్ద ట్రేడవుతోంది.Most Popular