మార్కెట్‌ జోరు - ఆటో రివర్స్‌ గేర్‌

మార్కెట్‌ జోరు - ఆటో రివర్స్‌ గేర్‌

ప్రపంచ సంకేతాలు అటూఇటుగా ఉన్నప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 148 పాయింట్లు పెరిగి 38,878కు చేరింది. నిఫ్టీ సైతం 51 పాయింట్లు బలపడి 11,693 వద్ద ట్రేడవుతోంది. ఎఫ్‌అండ్‌వో ముగింపు, ముడిచమురు ధరల సెగ, దేశీ కరెన్సీ రూపాయి పతనం వంటి ప్రతికూలతల కారణంగా గురువారం చివర్లో అమ్మకాలు పెరగడంతో మార్కెట్లు దెబ్బతిన్న విషయం విదితమే. కాగా.. నేటి నుంచి మే డెరివేటివ్‌ సిరీస్‌ ప్రారంభం నేపథ్యంలో ట్రేడర్లు కొత్త పొజిషన్లు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 

మెటల్ ప్లస్‌లో
ఎన్‌ఎస్‌ఈలో ఆటో(0.5 శాతం) మినహా అన్ని రంగాలూ పుంజుకున్నాయి. మెటల్‌, ఫార్మా, రియల్టీ, బ్యాంక్‌ నిఫ్టీ, ఐటీ 1.3-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా స్టీల్‌, ఐవోసీ, యాక్సిస్, కోల్‌ ఇండియా, బీపీసీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫ్రాటెల్‌, జీ, ఎన్‌టీపీసీ, సిప్లా 3-1 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్‌లో మారుతీ, టాటా మోటార్స్‌, ఇండస్‌ఇండ్, కొటక్‌ బ్యాంక్‌ మాత్రమే(1.3-0.6 శాతం మధ్య) డీలాపడ్డాయి. 

ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్‌ స్టాక్స్‌లో ఆర్‌పవర్, దివాన్‌ హౌసింగ్‌, అరబిందో, జిందాల్‌ స్టీల్‌, ఎంఆర్‌పీఎల్‌ 4-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క అజంతా ఫార్మా, కావేరీ సీడ్‌, జెట్‌ ఎయిర్‌, ఐడియా, మదర్‌సన్‌, మైండ్‌ట్రీ 2-1 శాతం మధ్య క్షీణించాయి. 

చిన్న షేర్లు ఓకే
మార్కెట్లు హుషారుగా ప్రారంభమైన నేపథ్యంలో చిన్న షేర్లకు డిమాండ్‌ కనిపిస్తోంది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.2 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 901 లాభపడగా.. 484 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో జీహెచ్‌సీఎల్‌, సైయెంట్‌, జేఅండ్‌కే బ్యాంక్‌, భూషణ్‌, ఆహ్లువాలియా, సట్లెజ్‌, టాల్‌బ్రొస్‌, ఆప్కోటెక్స్, ఎస్‌వీపీ, చమన్‌లాల్‌, యూకెన్ తదితరాలు 7-3.5 శాతం మధ్య జంప్‌చేశాయి.  Most Popular