స్టాక్స్‌ టు వాచ్‌.. (ఏప్రిల్ 26)

స్టాక్స్‌ టు వాచ్‌.. (ఏప్రిల్ 26)
 • నాల్గో త్రైమాసికంలో 84శాతం క్షీణతతో రూ.2295 కోట్లుగా నమోదైన టాటా స్టీల్‌ నికరలాభం
 • FY19కు గాను ఒక్కో షేరుకు రూ.23 డివిడెండ్‌ను ప్రకటించిన నెస్లే ఇండియా
 • రేమాండ్‌కు చెందిన రెండు అనుబంధ సంస్థలు రింగ్‌ ప్లస్‌ ఆక్వా, జేకే ఫైల్స్‌కు కొత్త చైర్మన్‌గా నియమితులైన రవి ఉప్పల్‌
 • వచ్చే ఏడాది నుంచి డీజిల్‌ కార్ల ఉత్పత్తిని నిలిపివేయనున్నట్టు ప్రకటించిన మారుతీ సుజుకీ
 • బాలెనో ధరను రూ.15వేల వరకూ పెంచిన మారుతీ సుజుకీ
 • క్యూ-4లో రూ.2188 కోట్ల నష్టం నుంచి రూ.1505 కోట్ల నికర లాభాన్ని ప్రకటించిన యాక్సిస్‌ బ్యాంక్‌
 • రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.1 డివిడెండు చెల్లించేందుకు యాక్సిస్‌ బ్యాంక్‌ డైరెక్టర్ల బోర్డు సిఫారసు
 • ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న ఇండిగో
 • క్యూ-4లో 54శాతం వృద్ధితో రూ.188 కోట్ల నికరలాభాన్ని ప్రకటించిన సైయెంట్‌
 • క్యూ-4లో 64 శాతం వృద్ధితో రూ.214 కోట్లుగా నమోదైన బయోకాన్‌ నికరలాభం
 • రూ.25వేల కోట్ల విలువైన వొడాఫోన్‌ ఇండియా రైట్స్‌ ఇష్యూకు 1.07 రెట్ల స్పందన
 • రైట్స్‌ ఇష్యూ ద్వారా ఒక్కో షేరును రూ.12.50 చొప్పున మొత్తం 2వేల కోట్ల షేర్లను జారీ చేసిన వొడాఫోన్‌ ఇండియా
 • QIP ద్వారా రూ.1400 కోట్ల నిధులను సమీకరించేందుకు హిందుస్తాన్‌ కాపర్‌ బోర్డు గ్రీన్‌సిగ్నల్‌
 • ఎల్‌ అండ్‌ టీ ఇన్‌ఫ్రా డెట్‌ ఫండ్‌లో 25.1 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు అపిస్‌పార్టనర్స్‌
 • రుచి సోయాను కొనుగోలు చేసేందుకు రూ.4350 కోట్లకు బిడ్‌ దాఖలు చేసిన పతంజలి ఆయుర్వేద్‌
 • పతంజలి ఆయుర్వేద్‌ సమర్పించిన బిడ్‌ను పరిశీలించడానికి ఇవాళ సమావేశం కానున్న రుచి సోయా బోర్డు 
 • జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ను కొనుగోలు చేసేందుకు బిడ్లను దాఖలు చేసిన ఎన్‌బీసీసీ, సురక్షా గ్రూప్‌
 • రాజస్థాన్‌లో తన చమురు-గ్యాస్‌ కార్యకలాపాల విస్తరణకు పర్యావరణ అనుమతులు పొందిన వేదాంతా


ఐపీఓ అప్‌డేట్స్‌..

 • నియోజెన్‌ కెమికల్స్‌ పబ్లిక్‌ ఇష్యూకు రెండో రోజున రెండు రెట్ల స్పందన
 • రూ.132 కోట్ల నిధుల సమీకరణ కోసం ఐపీఓకు వచ్చిన నియోజెన్‌ కెమికల్స్‌
 • మొత్తం 43,29,038 షేర్లకు గాను 60,21,405 షేర్లకు బిడ్‌లు దాఖలు


Most Popular