మారుతీ క్యూ4- సిమెంట్‌ యమస్ట్రాంగ్‌

మారుతీ క్యూ4- సిమెంట్‌ యమస్ట్రాంగ్‌

కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. క్యూ4(జనవరి-మార్చి)లో మారుతీ నికర లాభం 4.6 శాతం క్షీణించి రూ. 1796 కోట్లకు చేరగా.. మొత్తం ఆదాయం నామమాత్రంగా 1.4 శాతం పెరిగి రూ. 21459 కోట్లను తాకింది. వాటాదారులకు షేరుకి రూ. 80 డివిడెండ్‌ ప్రకటించింది. ఈ కాలంలో 25 శాతం తక్కువగా రూ. 2263 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించింది. కాగా.. ఇబిటా మార్జిన్లు 14.22 శాతం నుంచి 10.55 శాతానికి బలహీనపడ్డాయి. పన్ను వ్యయాలు రూ. 752 కోట్ల నుంచి రూ. 516 కోట్లకు తగ్గాయి. ఈ నేపథ్యంలో మారుతీ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 1.8 శాతం నష్టంతో రూ. 6880 వద్ద ట్రేడవుతోంది. 

Related image

సిమెంట్‌ షేర్ల జోరు
దిగ్జజ కంపెనీలు ఏసీసీ, అల్ట్రాటెక్ క్యూ4 ఫలితాలు ఆకట్టుకోవడంతో సిమెంట్ రంగ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో పలు కౌంటర్లు లాభాలతో సందడి చేస్తున్నాయి. ఎన్‌ఎస్ఈలో ప్రస్తుతం గ్రాసిమ్‌ 6 శాతం జంప్‌చేసి రూ. 931ను తాకగా.. ఇంట్రాడేలో రూ. 940 వరకూ ఎగసింది. ఇక అల్ట్రాటెక్‌ 5.4 శాతం ఎగసి రూ. 4630కు చేరింది. తొలుత రూ. 4687 సమీపంలో సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ఈ బాటలో ఏసీసీ 2 శాతం లాభపడి రూ. 1636 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1665కు ఎగసింది. ఇండియా సిమెంట్స్‌ 4 శాతం పెరిగి రూ. 110కు చేరగా.. రామ్‌కో సిమెంట్‌ 3.3 శాతం పుంజుకుని రూ. 798 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 808ను తాకింది. శ్రీ సిమెంట్ సైతం 3 శాతం లాభంతో రూ. 19,960ను తాకింది. తొలుత రూ. 20140 వద్ద చరిత్రాత్మక గరిష్టానికి చేరింది.Most Popular