వొడాఫోన్‌ ఐడియా- షా ఫుడ్స్‌ కుదేల్‌

వొడాఫోన్‌ ఐడియా- షా ఫుడ్స్‌ కుదేల్‌

ఇటీవలే రైట్స్‌ ఇష్యూని పూర్తిచేసుకున్న మొబైల్‌ టెలికం దిగ్గజం వొడాఫోన్‌ ఐడియా కౌంటర్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు కన్ఫెక్షనరీ దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్‌ నుంచి బిస్కట్ల ఔట్‌సోర్సింగ్‌ కాంట్రాక్టును కోల్పోయినట్లు వెల్లడించడంతో షా ఫుడ్స్‌ లిమిటెడ్‌ కౌంటర్లోనూ అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో ఈ రెండు కౌంటర్లూ లాభాల మార్కెట్లోనూ నష్టాలతో కళతప్పాయి. వివరాలు చూద్దాం...

వొడాఫోన్‌ ఐడియా
నిధుల సమీకరణ కోసం వొడాఫోన్‌ ఐడియా చేపట్టిన రైట్స్‌ ఇష్యూ 1.07 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌ అయినట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ప్రమోటరేతర విభాగంలో 1.18 రెట్లు బిడ్స్ లభించినట్లు అంచనా. మొత్తం రూ. 25,000 కోట్ల సమీకరణకు చేపట్టిన రైట్స్‌ ఇష్యూలో భాగంగా రూ. 27,000 కోట్లకు బిడ్స్‌ లభించినట్లు తెలుస్తోంది. సాధారణ వాటాదారులకు షేరుకి రూ. 12.5 ధరలో రైట్స్‌ జారీ చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ప్రమోటర్లు వొడాఫోన్‌, ఆదిత్య బిర్లా గ్రూప్‌.. రైట్స్‌లో భాగంగా దాదాపు రూ. 20,000 కోట్లవరకూ సబ్‌స్ర్కయిబ్‌ చేసినట్లు అంచనా. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో వొడాఫోన్‌ ఐడియా షేరు 3 శాతం పతనమై రూ. 16.7 వద్ద ట్రేడవుతోంది.  

Image result for britannia industries 

షా ఫుడ్స్‌ లిమిటెడ్‌
బిస్కట్ల తయారీ జాబ్‌ కాంట్రాక్టుకు ముగింపు పలుకుతున్నట్లు ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్‌ నుంచి సమాచారం అందిందని షా ఫుడ్స్‌ లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. అయితే బ్రిటానియాతో కాంట్రాక్టును రెన్యువల్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో షా ఫుడ్స్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. అమ్మేవాళ్లే తప్ప కొనుగోలుదారులు కరవుకావడంతో ఈ షేరు బీఎస్‌ఈలో 5 శాతం డౌన్‌ సర్క్యూట్‌ తాకింది. రూ. 4.6 నష్టంతో రూ. 86.7 వద్ద ఫ్రీజయ్యింది.Most Popular