అల్ట్రాటెక్‌కు కిక్‌- మహీంద్రా ఫైనాన్స్‌ వీక్‌

అల్ట్రాటెక్‌కు కిక్‌- మహీంద్రా ఫైనాన్స్‌ వీక్‌

గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడంతో సిమెంట్‌ రంగ దిగ్గజ సంస్థ అల్ట్రాటెక్‌  కౌంటర్‌కు వరుసగా రెండో రోజు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో అల్ట్రాటెక్‌ సిమెంట్ షేరు లాభాలతో సందడి చేస్తోంది. అయితే మరోవైపు గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఆకర్షణీయ ఫలితాలు సాధించినప్పటికీ మహీంద్రా అండ్‌ మహీందద్రా ఫైనాన్షియల్‌ షేరు అమ్మకాలతో డీలాపడింది. ఇతర వివరాలు చూద్దాం..

అల్ట్రాటెక్‌ సిమెంట్‌
గతేడాది క్యూ4లో అల్ట్రాటెక్ సిమెంట్ నికర లాభం రెట్టింపునకు ఎగసి రూ. 1017 కోట్లను అధిగమించింది. నిర్వహణ లాభం 21 శాతం పుంజుకుని రూ. 2213 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 18 శాతం పెరిగి రూ. 10,500 కోట్లను తాకింది. స్టాండెలోన్‌ ఫలితాలివి. వాటాదారులకు షేరుకి రూ. 11.50 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. దేశీయంగా సిమెంట్‌ అమ్మకాలు 16 శాతం పెరిగి 20.47 మిలియన్ టన్నులకు చేరినట్లు కంపెనీ తెలియజేసింది. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 5.25 శాతం జంప్‌చేసి రూ. 4625 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 4628 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. బుధవారం సైతం ఈ షేరు 4 శాతం లాభపడి రూ. 4395 వద్ద ముగిసింది. 

Related image

ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌
గతేడాది చివరి త్రైమాసికంలో  మహీంద్రా గ్రూప్‌ ఎన్‌బీఎఫ్‌సీ.. ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. నికర లాభం 87 శాతం జంప్‌చేసి రూ. 588 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 37 శాతం పెరిగి రూ. 2479 కోట్లను అధిగమించింది. కంపెనీలో ప్రమోటర్లకు 51.19% వాటా ఉంది. కాగా ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌ షేరు 2 శాతం క్షీణించి రూ. 425 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 419 దిగువకు చేరింది. Most Popular