ఐసీఐసీఐ ప్రు ప్లస్‌- ఇన్‌ఫ్రాటెల్‌ డల్‌

ఐసీఐసీఐ ప్రు ప్లస్‌- ఇన్‌ఫ్రాటెల్‌ డల్‌

గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాలకుతోడు విదేశీ బ్రోకింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ బయ్‌ రేటింగ్‌ను ప్రకటించడంతో ప్రయివేట్‌ రంగ బీమా సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. కాగా.. మరోవైపు గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో టెలికం టవర్ల దిగ్గజం భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ షేరు రేటింగ్‌ను సీఎల్‌ఎస్‌ఏ డౌన్‌గ్రేడ్‌ చేసింది. దీంతో ఈ కౌంటర్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీశారు. వివరాలు చూద్దాం..

ఐసీఐసీఐ ప్రు డెన్షియల్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఐసీఐసీఐ ప్రు డెన్షియల్‌ నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన 23 శాతం క్షీణించి రూ. 261 కోట్లకు పరిమితమైంది. అయితే మొత్తం ఆదాయం రెట్టింపునకు ఎగసి రూ. 16,054 కోట్లకు చేరింది. మొత్తం ప్రీమియం ఆదాయం 14 శాతం వృద్ధి సాధించింది. రూ. 30930 కోట్లను తాకింది. కాగా.. సీఎల్‌ఎస్‌ఏ ఈ షేరు కొనుగోలుకి సిఫారసు చేస్తూ టార్గెట్‌ ధరను రూ. 450 నుంచి రూ. 475కు పెంచింది. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ ప్రు డెన్షియల్‌ ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 2.6 శాతం పుంజుకుని రూ. 373 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 380 వరకూ ఎగసింది.

Image result for Bharti infratel

భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ 
గతేడాది చివరి క్వార్టర్‌లో భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ నికర లాభం నామమాత్ర వృద్ధితో రూ. 608 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 2 శాతం క్షీణించి రూ. 3600 కోట్లను తాకింది.  కాగా.. భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ కౌంటర్‌కు విదేశీ బ్రోకింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ సెల్‌ రేటింగ్‌ను ప్రకటించింది. టార్గెట్‌ ధరను రూ. 300 నుంచి రూ. 285కు కుదించింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం భారతీ ఇన్ఫ్రాటెల్ షేరు దాదాపు 3 శాతం పతనమై రూ. 293 దిగువన ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 287 వరకూ పతనమైంది.Most Popular