క్యూ4- అల్ట్రాటెక్ సిమెంట్ జూమ్‌

క్యూ4- అల్ట్రాటెక్ సిమెంట్ జూమ్‌

గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడంతో సిమెంట్‌ రంగ దిగ్గజ సంస్థ అల్ట్రాటెక్‌  కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో అల్ట్రాటెక్‌ షేరు 5.6 శాతం జంప్‌చేసి రూ. 4432 వద్ద ముగిసింది. ఇది ఇంట్రాడే గరిష్టంకావడం విశేషం! ఇతర వివరాలు చూద్దాం..

క్యూ4 గుడ్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో అల్ట్రాటెక్ సిమెంట్ ఆకర్షణీయ పనితీరు చూపింది. నికర లాభం రెట్టింపునకు ఎగసి రూ. 1017 కోట్లను అధిగమించింది. నిర్వహణ లాభం 21 శాతం పుంజుకుని రూ. 2213 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 18 శాతం పెరిగి రూ. 10,500 కోట్లను తాకింది. స్టాండెలోన్‌ ఫలితాలివి. వాటాదారులకు షేరుకి రూ. 11.50 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. దేశీయంగా సిమెంట్‌ అమ్మకాలు 16 శాతం పెరిగి 20.47 మిలియన్ టన్నులకు చేరినట్లు కంపెనీ తెలియజేసింది.Most Popular