ఎవరెడీ ఇండస్ట్రీస్‌- అమ్మకాల షాక్‌

ఎవరెడీ ఇండస్ట్రీస్‌- అమ్మకాల షాక్‌

ఇటీవల నేలచూపులతో కదులుతున్న నాన్‌డ్యురబుల్‌ హౌస్‌హోల్డ్‌ ప్రొడక్టుల సంస్థ ఎవరెడీ ఇండస్ట్రీస్‌ కౌంటర్లో మరోసారి అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రమోటర్లు తనఖాలో ఉంచిన వాటాలో కొంతమేర రుణదాత విక్రయించినట్లు వెల్లడికావడంతో ఈ కౌంటర్‌లో అమ్మకాలకు ఇన్వెస్టర్లు ఎగబడుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కంపెనీలో ప్రధాన ప్రమోటర్‌ విలయమ్సన్‌ మేజర్‌ అండ్‌కో వాటా 0.24 శాతం తగ్గి 23.43 శాతానికి పరిమితమైనట్లు ఎవరెడీ ఇండస్ట్రీస్‌  తాజాగా వెల్లడించింది. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఎవరెడీ షేరు 6.2 శాతం పతనమై రూ. 156 దిగువకు చేరింది. తొలుత ఒక దశలో రూ. 155 దిగువన నాలుగేళ్ల కనిష్టాన్ని తాకింది. గత మూడు రోజుల్లోనూ ఈ షేరు 12 శాతం క్షీణించడం గమనార్హం!

1.77 లక్షల షేర్లు
తనఖాలో ఉంచిన 1.77 లక్షల షేర్లను రుణదాత విక్రయించినట్లు ఎవరెడీ ఇండస్ట్రీస్‌ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది. కాగా.. గత ఆరు వారాల్లో ఎవరెడీ షేరు 26 శాతం తిరోగమించింది. కంపెనీలో 4.89 శాతం వాటా కలిగిన డీఎస్‌పీ ట్రస్టీ 3.8 శాతం వాటాకు సమానమైన 2.76 మిలియన్‌ షేర్లను ఇదే కాలంలో ఓపెన్‌ మార్కెట్ ద్వారా విక్రయించింది. షేరుకి రూ. 200 సగటు ధరలో వీటిని విక్రయించింది. ప్రస్తుతం ఎవరెడీలో మొత్తం ప్రమోటర్ల వాటా 44.11 శాతానికి చేరినట్లు కంపెనీ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. డిసెంబర్‌లో ఈ వాటా 44.35 శాతంగా నమోదైంది. ఇదే కాలంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటా 11.6 శాతం నుంచి 4.42 శాతానికి దిగిరాగా.. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల వాటా 14.59 శాతం నుంచి 19.2 శాతానికి ఎగసింది!Most Popular