నియోజెన్ కెమికల్స్ ఐపీఓ..! అప్లై చేయొచ్చా?  

నియోజెన్ కెమికల్స్ ఐపీఓ..! అప్లై చేయొచ్చా?  

బ్రోమైన్ మరియు లీథియమ్ కెమికల్ కాంపౌండ్స్ తయారు చేసే నియోజెన్ కెమికల్స్ నేటి బుధవారం నాడు  ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌ (IPO)కు రానుంది. నియోజెన్ కెమికల్స్ తన ప్రైస్‌ బాండ్‌ను రూ. 212-215 మధ్యన తీసుకురానున్నట్టు సమాచారం. ఈ IPO ద్వారా నియోజెన్ సుమారు 132 కోట్ల నిధులను సమీకరించుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ పబ్లిక్ ఇష్యూ ఏప్రిల్ 24 న ప్రారంభమై, ఏప్రిల్ 26న క్లోజ్ కానుంది.  ఈ IPO ద్వారా తొలుత రూ. 70 కోట్లు సమీకరించుకుని ప్రమోటర్ల ద్వారా వాటాలను విక్రయించడానికి కంపెనీ సిద్ధపడింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా వచ్చిన నిధులను రుణ చెల్లింపులకు, ప్రారంభ మూల ధన వాటాలకు ఉపయోగించనున్నట్టు నియోజెన్ ఓ ప్రకటనలో పేర్కొంది. 
తొలి పబ్లిక్ ఆఫర్ ద్వారా నిధులు సమీకరించేందుకు స్పెషాలిటీ కెమికల్స్‌ తయారీ సంస్థ నియోజెన్‌ కెమికల్స్‌కు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి లభించింది. దీని ప్రకారం.. కంపెనీ రూ.70 కోట్ల వరకు విలువైన తాజా షేర్ల జారీ చేయనుంది. ప్రస్తుత ప్రమోటర్లు రూ.29 లక్షల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో విక్రయించనుంచనున్నట్టు సమాచారం. 
నియోజెన్ గత సంవత్సరం నుండి ఇప్పటి దాకా వార్షిక వృద్ధి రేటు 19.7శాతం గా ఉందని (YoY CAGR) , ఆపరేటింగ్ రెవిన్యూ  2014-18 ఆర్ధిక సంవత్సరాల మధ్య కాలంలో రూ. 164.01 కోట్లుగా ఉందని నియోజెన్ పేర్కొంది. 2018 ఆర్ధిక సంవత్సరంలో  ఎబిటిడా వార్షిక వృద్ధి రేటు 26.1శాతంతో రూ. 28.99 కోట్ల ఆదాయాన్ని కంపెనీ చూపింది. బ్రోకరేజ్ సంస్థల అంచనా ప్రకారం నియోజెన్ ప్రైస్‌ బ్యాండ్ గరిష్టంగా రూ. 215 వరకూ ఉండొచ్చని అంచనా. నియోజెన్ షేర్ పర్ ఎర్నింగ్స్ (P/E) 47.8 రెట్లు హెచ్చించి  EPS (ఎర్నెస్ట్ పర్ షేర్ ) రూ. 4.5 గా నిర్ణయించారు. ఇది ప్రీమియంలో గరిష్ట యావరేజ్ 38.8 రెట్లుగా ఉంది. 
కంపెనీ హైయ్యర్ మల్టిపుల్‌గా ఉందని, లాభదాయకత, మెరుగైన రాబడి నిష్పత్తి సామర్ధ్యం  కలిగి ఉంది కాబట్టి ఈ స్టాక్స్‌ను సబ్‌ స్క్రైబ్ చేసుకోవచ్చని ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఆనంద్ రాఠీ సూచించింది. 2019, 2020 ఆర్ధిక సంవత్సర EPS ఆధారంగా ఈ స్టాక్స్ వరుసగా 32.3 x, మరియు 26x పర్ ఎర్నింగ్స్ ను కలిగి ఉన్నాయి కాబట్టి సగటు ప్రీమియం వద్ద కూడా అందుబాటులో ఉన్న కారణంగా ఈ స్టాక్స్ రానున్న రోజుల్లో మంచి ఫలితాలను ఇవ్వొచ్చని ఆనంద్ రాఠీ పేర్కొంది. 


 Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');