ఈ పదేళ్లలో వచ్చిన ఐపీఓల్లో ఎన్ని సక్సెస్.. ఏవి సూపర్ హిట్

ఈ పదేళ్లలో వచ్చిన ఐపీఓల్లో ఎన్ని సక్సెస్.. ఏవి సూపర్ హిట్

దేశీయ స్టాక్ మార్కెట్లలో గత పదేళ్లుగా కొత్తగా వచ్చిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్స్ (IPOs) కంనీలు లిస్టింగ్ తరువాత చాలా వరకూ నష్టాల్లోనే ఉండిపోయాయి. పబ్లిక్ ఇష్యూకి వెళ్ళిన చాలా IPOలు తమ మినిమమ్ ప్రైస్‌ కంటే తక్కువగానే ట్రేడ్ అవుతున్నాయి. ఎకానిమిక్స్ టైమ్స్ జరపిన సర్వే ప్రకారం 2008 నుండి ఇప్పటి దాకా లిస్టింగ్ అయిన 164  IPOs లో దాదాపు 100 కంపెనీల స్టాక్స్ తమ ఇష్యూ ధర కంటే తక్కువగా నమోదవుతున్నాయి. వీటిలో కేవలం 44 కంపెనీలు మాత్రమే డబుల్ డిజిట్ ప్రాఫిట్లను అందించాయి. ఇన్వెస్టర్లకు పోస్ట్ లిస్టింగ్‌లో పలు IPOలు  అప్‌సైడ్ ఆఫర్లు ప్రకటించినా.. వాస్తవంలో మాత్రం వాటి ఇష్యూ ధర కంటే తక్కువగా ట్రేడ్ అవ్వడం గమనార్హం. ఇన్వెస్టర్లకు కూడా ఇష్యూ ధర కంటే తక్కువగా ట్రేడ్ అవుతున్నా, దీర్ఘకాలిక పెట్టుబడులుగా వాటిని ఉంచుకోడంతో మరింతగా స్టాక్స్ ప్రైసెస్ పడిపోతున్నాయి. ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్స్  మాత్రం ఆయా కంపెనీల వాల్యూయేషన్స్‌ను పెంచి చూపించడంతో వాస్తవ ధరలు తగ్గిపోతున్నాయి. ఇలా బ్యాంకర్లు అధిక లిక్విడిటీ వల్ల కంపెనీలకు విలువను జోడించడంతో IPO పెట్టుబడిదారులకు తక్కువ ట్రేడింగ్ వాల్యూమ్స్ కనబడతున్నాయని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. 
గత పదేళ్లలో లిస్ట్ అయిన కంపెనీల్లో చాలా వరకూ వాటి ఇష్యూ ధర కంటే తక్కువగా 90శాతం కంటే ఎక్కువ గా పడిపోయిన స్టాక్స్ చాలానే ఉన్నాయి. గామన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ తన లిస్టింగ్ సమయంలో ఇష్యూ ధర రూ. 167గా నిర్ణయించింది. ప్రస్తుతం ఆ స్టాక్స్ రూ. 0.7 గా ట్రేడ్ అవుతోంది. అంటే దాదాపు 99.6శాతం షేర్ వాల్యూ పడిపోయింది. అలాగే KSK  ఎనర్జీ వెంచర్స్ ఇష్యూ ధర రూ. 240గా ఉండగా ప్రస్తుతం రూ. 1.1 గా ట్రేడ్ అవుతోంది. ఇది కూడా -99.4శాతం నష్టపోయింది.  రిలయన్స్ పవర్ లిమిటెడ్ -98.3 శాతం నష్టంతో రూ. 7.6 వద్ద ట్రేడ్ అవుతోంది. దీని అసలు ఇష్యూ ధర రూ. 450గా ఉంది. అలాగే జేపీ ఇన్ఫ్రాటెక్ ఇష్యూధర 102 గా ఉంటే ప్రస్తుత ట్రేడింగ్ వాల్యూమ్ రూ. 2.2 గా ఉంది. ఇది కూడా -97.8శాతం నష్టపోయింది. 

IPO snip 6
చాలా కంపెనీలు IPO కు వెళ్లడానికి ముందు తమ కంపెనీ ప్రాథమిక పనితీరును వివరించినా.. ప్రీ IPO ఫండమెంటల్స్ విషయంలో వెనకంజ వేయడంతో అవి అండర్ పెర్ఫార్మెన్స్ లో పడిపోతాయని ఎలారా క్యాపిటల్ సంస్థ పేర్కొంది. చాలా కంపెనీలు తమ ప్రీ లిస్టింగ్ ధరలను అందుకోలేక పోవడంతో IPOల్లో పెట్టుబడులు పెట్టడం సరైన వ్యూహం కాకపోవచ్చని ఎలారా క్యాపిటల్ భావిస్తోంది. ఇలాంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందు కంపెనీ యొక్క స్థితి గతులు, వర్తమాన , భవిష్యత్ పనితీరును బేరీజు వేసుకోవాలని ఎలారా క్యాపిటల్ సూచిస్తోంది.  బుల్ మార్కెట్లు గతంలో లెహమాన్ సంక్షోభాన్ని చవి చూసి ఉండటం వల్ల IPOల మీద ఆసక్తిని తగ్గించుకున్నాయి.

Image result for abbreviation of IPOs in stock market

2008 కి ముందు భారతదేశంలో విదేశీ పెట్టుబడులు పెరగడంతో ఇన్ఫ్రా , రియల్ ఎస్టేట్ కంపెనీలకు డిమాండ్ పెరిగింది. కానీ.. ఆర్ధిక మాంద్యం తరువాత ఈ రంగాల్లో లాభదాయకత బాగా దెబ్బతింది. 2017-18 మధ్య కాలంలో మార్కెట్లు బుల్లిష్ గా ఉండటంతో CL ఎడ్యుకేట్,  S.చాంద్,  జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పోరేషన్,  ప్రెసిషన్ కేమ్‌షాఫ్ట్స్ , ICICI సెక్యూరిటీస్  వంటి కంపెనీలు తమ వాల్యూయేషన్స్ లో సగానికి పైగా కోల్పోయాయి. పబ్లిక్ సెక్టార్ రంగంలోని IPOలు కూడా ఇన్వెస్టర్లను పూర్తిగా నిరుత్సాహ పరిచాయి. కోల్ ఇండియా IPO కి వచ్చిన 9 ఏళ్ల తరువాత కూడా ఇప్పటికీ తన ఇష్యూ ప్రైస్‌ను చేరుకోడానికి కొట్టుమిట్టాడుతుంది. అలాగే హిందూస్థాన్ ఎరోనాటిక్స్ , కొచ్చిన్ షిప్ యార్డ్ , న్యూ ఇండియా ఎస్యూరెన్స్ వంటి కంపెనీలు తమ IPO ఇష్యూ ధర కంటే తక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. చాలా వరకూ IPO కంపెనీలు వాటి ధరల ఇష్యూలో దూకుడును ప్రదర్శించవచ్చు. కానీ.. వాటి పనితీరు పరిశ్రమల దృష్టికోణం, వ్యాపార నాణ్యత, నిర్వాహణ వంటి అంశాలపై ఆధార పడి ఉంటుంది. IPOలో పెట్టుబడి పెట్టాలనుకున్న ఇన్వెస్టర్లు ముందు ఆయా కంపెనీల పనితీరును, భవిష్యత్తులో వాటి వ్యాపార విస్తరణ ఎలా ఉండబోతుందన్నదానిని పరిశీలించాలని ప్రముఖ బ్రోకింగ్ సంస్థలు సూచిస్తున్నాయి.  

 Most Popular