లాభాల్లో.. ఐటీ అప్‌- ఆటో డౌన్‌

లాభాల్లో.. ఐటీ అప్‌- ఆటో డౌన్‌

మూడు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పెడుతూ సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 101 పాయింట్లు పెరిగి 38,666కు చేరగా.. నిఫ్టీ సైతం 32 పాయింట్లు బలపడి 11,608 వద్ద ట్రేడవుతోంది. ముడిచమురు ధరల సెగ, ఎఫ్‌అండ్‌వో ముగింపు తదితర అంశాల నేపథ్యంలో మంగళవారం వరుసగా మూడో రోజు మార్కెట్లు డీలాపడ్డాయి. అయితే ట్రేడర్ల షార్ట్‌ కవరింగ్‌ కారణంగా తొలుత బౌన్స్‌బ్యాక్‌కావడం గమనార్హం! కాగా.. గురువారం డెరివేటివ్స్‌ ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించే వీలున్నట్లు  విశ్లేషకులు భావిస్తున్నారు.

టాటా మోటార్స్‌  వీక్
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ 0.8 శాతం, రియల్టీ 0.5 శాతం చొప్పున పుంజుకోగా.. ఆటో 1.2 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.64 శాతం చొప్పున క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీ, ఐవోసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇండస్‌ఇండ్, ఎయిర్‌టెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టెక్‌ మహీంద్రా, గెయిల్‌, టైటన్‌ 2.5-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే టాటా మోటార్స్‌ దాదాపు 6 శాతం పతనంకాగా.. అల్ట్రాటెక్‌, హీరో మోటో, వేదాంతా, మారుతీ, గ్రాసిమ్‌, యాక్సిస్‌, పవర్‌గ్రిడ్, ఐటీసీ, టాటా స్టీల్‌ 1.75-0.75 శాతం మధ్య క్షీణించాయి. 

సిమెంట్‌ డౌన్‌
డెరివేటివ్‌ స్టాక్స్‌లో సీజీ పవర్, పీసీ జ్యువెలర్స్‌, ఇన్ఫీబీమ్‌, సెయిల్‌, కావేరీ సీడ్‌, భారత్ ఫైనాన్స్‌, దివీస్‌ లేబ్‌ 6-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క టాటా మోటార్స్‌ డీవీఆర్‌, ఏసీసీ, అంబుజా సిమెంట్‌, ఆర్‌పవర్‌, ఐజీఎల్‌, సీఈఎస్‌సీ, చోళమండలం, మహానగర్‌ గ్యాస్, మదరస్‌సన్‌ 6-2.2 శాతం మధ్య పతనమయ్యాయి. 

చిన్న షేర్లు ఫ్లాట్‌
మార్కెట్లు ఉత్సాహంగా ట్రేడవుతున్నప్పటికీ మధ్య, చిన్నతరహా షేర్లలో ట్రెండ్‌ అటూఇటుగా కనిపిస్తోంది. బీఎస్‌ఈలో ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1005 లాభపడగా.. 1160 నష్టాలలో ఉన్నాయి. మిడ్‌ క్యాప్స్‌లో ఎడిల్‌వీజ్‌, కన్సాయ్‌, పీజీహెచ్‌, రామ్‌కో సిమెంట్‌, క్రాంప్టన్, జిందాల్‌ స్టీల్‌, టొరంట్‌ ఫార్మా, టొరంట్‌ పవర్‌, ఎంఆర్‌ఎఫ్‌ తదితరాలు 3.5-1.5 శాతం మధ్య డీలాపడ్డాయి. 



Most Popular