రుపీ 70కు చేరువలో(అప్‌డేట్‌)

రుపీ 70కు చేరువలో(అప్‌డేట్‌)

ముందురోజు స్వల్పంగా బలపడినప్పటికీ దేశీ కరెన్సీ మరోసారి నేలచూపులకు లోనవుతోంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి తొలుత 17 పైసలు నీరసించి 69.80 వద్ద ప్రారంభమైంది. తదుపరి మరింత తిరోగమించింది. ప్రస్తుతం 32 పైసలు(0.5 శాతం) బలహీనపడి 69.94 వద్ద ట్రేడవుతోంది. వెరసి సాంకేతికంగా కీలకమైన 70 మార్క్‌ సమీపానికి చేరింది. ఇది రెండు వారాల కనిష్టంకావడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు స్పీడందుకోవడంతో సోమవారం 32 పైసలు క్షీణించిన రూపాయి మంగళవారం స్వల్పంగా 5 పైసలు పుంజుకుంది. మంగళవారం ముగింపు 69.67తో పోలిస్తే 69.62 వద్ద నిలిచింది. అయితే ఇంట్రాడేలో 69.53 వద్ద గరిష్టాన్ని, 69.83 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది.

చమురు ఎఫెక్ట్‌
రెండు రోజుల క్రితం ఇరాన్‌ నుంచి ఆసియా దేశాలు సైతం చమురును దిగుమతి చేసుకోరాదంటూ అమెరికా ప్రభుత్వం నిషేధాన్ని విస్తరించడంతో రూపాయిపై ప్రతికూల ప్రభావం కొనసాగుతున్నట్లు ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. మరోపక్క మంగళవారం దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టడం, మార్కెట్లు క్షీణించడం వంటి అంశాలు కూడా రూపాయిని బలహీనపరచినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. Most Popular