టాటా గ్లోబల్‌ చేతికి ధున్సేరీ బ్రాండ్స్‌

టాటా గ్లోబల్‌ చేతికి ధున్సేరీ బ్రాండ్స్‌

గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో పానీయాల దిగ్గజం టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. ధున్సేరీ టీ అండ్‌ ఇండస్ట్రీస్‌ నుంచి బ్రాండెడ్‌ టీ బిజినెస్‌ కొనుగోలుకి నాన్‌బైండింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు టాటా గ్రూప్‌ సంస్థ టాటా గ్లోబల్‌ తాజాగా పేర్కొంది. ఈ నేపథ్యంలో టాటా గ్లోబల్‌ కౌంటర్‌ అమ్మకాలతో కళతప్పగా.. ధున్సేరీ టీ లాభాలతో ఘుమఘుమలాడుతోంది. ఇతర వివరాలు చూద్దాం..

Related image

రూ. 2.5 డివిడెండ్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌ నికర లాభం 61 శాతం పతనమై రూ. 23 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం 5 శాతం పుంజుకుని రూ. 1775 కోట్లను అధిగమించింది. వాటాదారులకు షేరుకి రూ. 2.5 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. కాగా.. ధున్సేరీ టీ అండ్‌ ఇండస్ట్రీస్‌ నుంచి బ్రాండెడ్‌ టీ బిజినెస్‌ కొనుగోలుకి నాన్‌బైండింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు టాటా గ్లోబల్‌ తెలియజేసింది. డీల్‌ విలువను రూ. 101 కోట్లుగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో టాటా గ్లోబల్‌ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 4.3 శాతం పతనమై రూ. 201 వద్ద ట్రేడవుతోంది. అయితే ఈ ఒప్పందం నేపథ్యంలో మరోవైపు ధున్సేరీ టీ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టారు. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. ప్రస్తుతం రూ. 46 జంప్‌చేసి రూ. 275 సమీపంలో ఫ్రీజయ్యింది. ధున్సేరీ టీలో ప్రమోటర్లకు ప్రస్తుతం 67.13% వాటా ఉంది. Most Popular