4 స్టాక్స్ కొన్నారు.. 5 స్టాక్స్ అమ్మేశారు ! రాకేష్ కొత్త పోర్ట్‌ఫోలియో

4 స్టాక్స్ కొన్నారు.. 5 స్టాక్స్ అమ్మేశారు ! రాకేష్ కొత్త పోర్ట్‌ఫోలియో


రాకేష్ జున్‌జున్‌వాలా.. ఇండియన్ బిగ్ బుల్. ఆయన గురించి స్టాక్ మార్కెట్ జనాలకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు. స్టాక్స్ గురించి కొద్దో గొప్పో తెలిసిందీ అంటే.. ఖచ్చితంగా ఆర్.జె. గురించి అవగాహన ఉండే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఏదీ కొన్నా వార్తే.. ఏది అమ్మినా మార్కెట్ టాకే. అలాంటి రాకేష్.. గతేడాది మార్చి 31 నాటికి తన పోర్ట్‌ఫోలియోలో కొన్ని కీలక మార్పులు చేసుకున్నారు. నాలుగు కంపెనీల్లో వాటాలు పెంచుకుంటే.. ఐదింటిలో మెల్లిగా తన స్టేక్ తగ్గించుకుంటూ వస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే.. మార్చి క్వార్టర్‌లో ఎలాంటి మార్పులు ఉన్నాయి అనే విషయాన్ని మాత్రమే ఇక్కడ క్రోడీకరించారు. 

ఫస్ట్ సోర్స్, లుపిన్, విఐపీ ఇండస్ట్రీస్, డి హెచ్ ఎఫ్ ఎల్‌లో షేర్లు అధికంగా కొన్నారు. అదే సమయంలో టీవీ18 బ్రాడ్‌కాస్ట్, టైటాన్, ఫెడరల్ బ్యాంక్, ఆగ్రోటెక్ ఫుడ్స్ లిమిటెడ్, క్రిసిల్‌లో మాత్రం వాటాలను తగ్గించుకున్నారు రాకేష్. 

ఈ కింద ఇచ్చిన లిస్ట్‌లో సుమారు 25 కంపెనీలు ఉన్నాయి. వీటిల్లో రాకేష్ ఇన్వెస్ట్‌మెంట్ 1 శాతానికిపైగా ఉన్నవే ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా ఆయన పోర్ట్‌ఫోలియోలో చాలా స్టాక్స్ ఉంటాయి, అయితే అవి ఒక్క శాతం కంటే తక్కువే ఉండడంతో ఆ లిస్ట్ బయటకు తెలియదు. 

రాకేష్ స్టాక్స్ నీరసించాయ్
రాకేష్ ఈ మధ్ కొన్న 4 స్టాక్స్‌లో మూడు స్టాక్స్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. వాటిల్లో దివాన్ హోసింగ్ 36 శాతం, విఐపీ 8 శాతం నష్టాలని మిగిల్చాయి. లుపిన్ మాత్రం అక్కడక్కడే ఉంది. 

హ్యాండ్స్ డౌన్
టైటాన్‌లో ఆర్.జె. ఈ మధ్య వాటాలు తగ్గించుకున్న తర్వాత సదరు స్టాక్ సుమారు 21 శాతం కొండెక్కింది. అదే సమయంలో ఫెడరల్ బ్యాంక్ 4 శాతం వరకూ పెరిగింది. ఈ మధ్య  బాగా పర్ఫార్మ్ చేస్తున్న అనేక స్టాక్స్‌లో ఎలాంటి మార్పులూ చేసుకోలేదు రాకేష్. స్పైస్ జెట్ 52 శాతం, ఎన్.సి.సి. 17 శాతం, ఓరియంట్ సిమెంట్ 15 శాతం, ఎస్కార్ట్స్ 9 శాతం వరకూ పెరిగాయి. 
కొన్ని స్టాక్స్ పాతాళానికి పడిపోతున్నా ఆయన మాత్రం గుండె నిబ్బరంతో సదరు స్టాక్స్‌ను తన దగ్గరే ఉంచుకున్నారు. డిబి రియాల్టీ (39 శాతం), బిల్‌కేర్(20శాతం), మంధానా రిటైల్ 20 శాతం ఇయర్ టు డేట్‌ పద్ధతిలో పతనమయ్యాయి. 


నోట్ - ఇవి కేవలం సమాచారం కోసం మాత్రమే. ఈ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టేముందు మీ రీసెర్చ్ మీరు చేసుకోండి. లేకపోతే నిపుణుల సలహాలు తీసుకోండి. Most Popular