ధున్సేరీ టీ స్ట్రాంగ్‌- స్టెరిలైట్‌ వీక్‌

ధున్సేరీ టీ స్ట్రాంగ్‌- స్టెరిలైట్‌ వీక్‌

బ్రాండెడ్‌ టీ బిజినెస్‌ విక్రయానికి వీలుగా నాన్‌బైండింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు బోర్డు అనుమతించినట్లు ధున్సేరీ టీ అండ్‌ ఇండస్ట్రీస్‌ తాజాగా వెల్లడించింది. దీంతో ఈ కౌంటర్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ కౌంటర్లో అమ్మేవాళ్లు కరవుకావడం గమనార్హం! కాగా.. మరోపక్క గతేడాది(2018-19) చివరి త్రైమాసిక ఫలితాలు నిరాశ పరచడంతో ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్కింగ్‌ సంస్థ స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వివరాలు చూద్దాం..

ధున్సేరీ టీ 
ప్యాకేజ్‌డ్‌, బ్లెండింగ్‌ టీ తయారీ సంస్థ ధున్సేరీ టీ బ్రాండెడ్‌ టీ బిజినెస్‌ విక్రయానికి నాన్‌బైండింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలియజేసింది. కంపెనీ లాల్‌ఘోడా, కాలా ఘోడా బ్రాండ్లతో కూడిన బిజినెస్‌ను విక్రయించనున్నట్లు తెలియజేసింది. డీల్‌ విలువ రూ. 101 కోట్లుకాగా.. ఈ నేపథ్యంలో ధున్సేరీ టీ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టారు. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. ప్రస్తుతం రూ. 46 జంప్‌చేసి రూ. 275 సమీపంలో ఫ్రీజయ్యింది. కంపెనీలో ప్రమోటర్లకు ప్రస్తుతం 67.13% వాటా ఉంది. 

Image result for sterlite technologies

స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ నికర లాభం 11 శాతం పెరిగి రూ. 163 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం 34 శాతం జంప్‌చేసి రూ. 1791 కోట్లను తాకింది. అయితే నిర్వహణ లాభ మార్జిన్లు 26 శాతం నుంచి 17.6 శాతానికి క్షీణించాయి. దీంతో ఈ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 4 శాతం పతనమై రూ. 199 వద్ద ట్రేడవుతోంది.Most Popular