లాభాలతో మొదలు- సిమెంట్‌ షేర్లు వీక్‌

లాభాలతో మొదలు- సిమెంట్‌ షేర్లు వీక్‌

మూడు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పెడుతూ దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. వెనువెంటనే ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ లాభాల సెంచరీ చేసింది. ప్రస్తుతం 100 పాయింట్లు పెరిగి 38,665కు చేరింది. నిఫ్టీ సైతం 36 పాయింట్లు బలపడి 11,612 వద్ద ట్రేడవుతోంది. ముడిచమురు ధరల సెగ, ఎఫ్‌అండ్‌వో ముగింపు తదితర అంశాల నేపథ్యంలో మంగళవారం వరుసగా మూడో రోజు మార్కెట్లు డీలాపడ్డాయి. అయితే ట్రేడర్ల షార్ట్‌ కవరింగ్‌ కారణంగా తొలుత బౌన్స్‌బ్యాక్‌కావడం గమనార్హం! కాగా.. గురువారం డెరివేటివ్స్‌ ముగింపు నేపథ్యంలో మార్కెట్లు మరోసారి ఊగిసలాటకు లోనుకావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

రియల్టీ అప్‌
ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ, ఐటీ, బ్యాంక్‌ నిఫ్టీ 0.8-0.3 శాతం మధ్య పుంజుకోగా.. మెటల్‌ 0.4 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్‌జీసీ, బీపీసీఎల్‌, ఇండస్‌ఇండ్, ఐవోసీ, ఐబీ హౌసింగ్‌, గెయిల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్‌ మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్‌, ఆర్‌ఐఎల్‌ 3-0.7 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే హీరో మోటో, గ్రాసిమ్‌, టాటా మోటార్స్‌, వేదాంతా, మారుతీ, టాటా స్టీల్‌, జీ, అదానీ పోర్ట్స్‌, సిప్లా, సన్‌ ఫార్మా 1.5-0.6 శాతం మధ్య క్షీణించాయి. రియల్టీ స్టాక్స్‌లో ఇండియాబుల్స్‌ 6 శాతం జంప్‌చేయగా.. గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, డీఎల్‌ఎఫ్‌, మహీంద్రా లైఫ్‌, ఫీనిక్స్‌ 2-1 శాతం మధ్య పుంజుకున్నాయి.

సిమెంట్‌ డౌన్‌
డెరివేటివ్‌ స్టాక్స్‌లో పీసీ జ్యువెలర్స్‌, ఇన్ఫీబీమ్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, భారత్ ఫైనాన్స్‌ 3.5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క ఏసీసీ, అంబుజా సిమెంట్‌, లుపిన్‌, సెంచురీ టెక్స్‌టైల్స్‌, రామ్‌కో సిమెంట్‌, జిందాల్‌ స్టీల్‌ 5-2 శాతం మధ్య పతనమయ్యాయి. 

చిన్న షేర్లు ఓకే
మార్కెట్లు ఉత్సాహంగా కదులుతున్న నేపథ్యంలో చిన్నతరహా షేర్లకు డిమాండ్‌ కనిపిస్తోంది. బీఎస్‌ఈలో స్మాల్‌ క్యాప్‌ 0.3 శాతం  బలపడింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 733 లాభపడగా.. 425 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో డీవీఎల్‌, ఎస్‌టీసీ, గుడ్‌రిక్‌, పీఫోకస్‌, కోరమాండల్‌, జెనరిక్‌, ఆర్‌ఎంఎల్‌, విశాల్‌, రాణే హోల్డింగ్స్‌ తదితరాలు 15-4 శాతం మధ్య జంప్‌చేశాయి.  



Most Popular