యూఎస్‌ కొత్త రికార్డ్‌- ట్విటర్‌ జూమ్‌

యూఎస్‌ కొత్త రికార్డ్‌- ట్విటర్‌ జూమ్‌

ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌, సోషల్‌ మీడియా సంస్థ ట్విటర్‌ జోరందుకోవడంతో అమెరికన్‌ స్టాక్‌ ఇండెక్సులు ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ సరికొత్త గరిష్టాలను చేరాయి. మంగళవారం డోజోన్స్‌ 145 పాయింట్లు(0.55 శాతం) ఎగసి 26,656కు చేరగా.. ఎస్‌అండ్‌పీ 26 పాయింట్ల(0.9 శాతం) లాభంతో 2,934 వద్ద నిలిచింది. నాస్‌డాక్‌ మరింత అధికంగా 106 పాయింట్లు(1.3 శాతం) జంప్‌చేసి 8,121 వద్ద స్థిరపడింది. వెరసి ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ చరిత్రాత్మక గరిష్టాల వద్ద ముగిశాయి. ఎస్‌అండ్‌పీ ఈ ఏడాది(2019)లో ఇంతవరకూ 17 శాతం ర్యాలీ చేయడం విశేషం. ప్రధానంగా బ్లూచిప్‌ కంపెనీలు యునైటెడ్‌ టెక్నాలజీస్‌, లాక్‌హీడ్‌ మార్టిన్‌ కార్ప్‌, కోక కోలా ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.

హాస్‌బ్రో ఇంక్‌ హైజంప్‌
క్యూ1లో అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించడంతో సోషల్‌ మీడియా సంస్థ ట్విటర్‌ ఇంక్‌ షేరు దాదాపు 16 శాతం దూసుకెళ్లింది. ఈ బాటలో హాస్‌బ్రో ఇంక్‌ 14 శాతం జంప్‌చేసింది. ఇదే విధంగా పానీయాల దిగ్గజం కోక కోలా 2 శాతం ఎగసింది. కోక్‌ జీరోకు పెరిగిన డిమాండ్‌ ఇందుకు సహకరించగా.. పటిష్ట ఫలితాలకుతోడు ఆదాయ అంచనాలు(గైడెన్స్‌) ఆకట్టుకోవడంతో లాక్‌హీడ్‌ మార్టిన్‌ దాదాపు 6 శాతం జంప్‌చేసింది. ప్రోత్సాహకర గైడెన్స్‌ నేపథ్యంలో యునైటెడ్‌ టెక్నాలజీస్‌ 2.3 శాతం లాభపడింది. వారాంతాన పనితీరు వెల్లడించనున్న అమెజాన్‌ ఇంక్‌ సైతం 2.2 శాతం పుంజుకుంది. అయితే నిర్వహణ లాభాలు తగ్గడంతో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ప్రాక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ దాదాపు 3 శాతం పతనమైంది.

Image result for lockheed martin

ఆసియా అటూఇటూ
మంగళవారం యూరోపియన్‌ మార్కెట్లలో యూకే 0.9 శాతం పుంజుకోగా, ఫ్రాన్స్‌, జర్మనీ 0.15 శాతం బలపడ్డాయి. ప్రస్తుతం ఆసియాలో మిశ్రమ ట్రెండ్‌ కనిపిస్తోంది. కొరియా, హాంకాంగ్‌, చైనా 1-0.6 శాతం మధ్య నీరసించగా.. ఇండొనేసియా 0.15 శాతం క్షీణించింది. మిగిలిన మార్కెట్లలో సింగపూర్‌, తైవాన్‌ స్వల్ప లాభాలతో కదులుతుంటే.. జపాన్‌, థాయ్‌లాండ్‌  దాదాపు యథాతథంగా కదులుతున్నాయి. కాగా.. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 97.60కు చేరగా.. డాలరుతో మారకంలో యూరో 1.121ను తాకింది. జపనీస్‌ యెన్‌ 111.82 వద్ద కదలుతోంది.Most Popular