చివరికి నష్టాలే- ఫార్మా ప్లస్‌లో

చివరికి నష్టాలే- ఫార్మా ప్లస్‌లో

తొలుత హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి నష్టాలతో ముగిశాయి. రోజంతా స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేట్‌ అయ్యాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 80 పాయింట్లు క్షీణించి 38,565 వద్ద నిలవగా.. 19 పాయింట్లు నీరసించిన నిఫ్టీ 11,576 వద్ద స్థిరపడింది. వెరసి వరుసగా రెండో రోజు మార్కెట్లు నష్టాలతో నిలిచాయి. అంతకుముందు ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38832-38518 పాయింట్ల మధ్య ఆటుపోట్లను చవిచూసింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 11646-11565 మధ్య ఊగిసలాడింది. ముడిచమురు ధరల మంటతో ముందురోజు పతనమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు ట్రేడర్ల షార్ట్‌ కవరింగ్‌ కారణంగా తొలుత బౌన్స్‌బ్యాక్‌ అయినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. డెరివేటివ్స్‌ ముగింపు, ఎన్నికల మూడో దశ పోలింగ్‌ నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు.

బ్యాంక్స్‌ వీక్
ఎన్‌ఎస్‌ఈలో ఆటో, బ్యాంక్‌ నిఫ్టీ, మెటల్‌ 1.5-0.4 శాతం మధ్య బలహీనపడగా.. ఫార్మా 1 శాతం పుంజుకుంది. నిఫ్టీ దిగ్గజాలలో మారుతీ, యస్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్, హీరోమోటో, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, గెయిల్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ 3.6-1.2 శాతం మధ్య క్షీణించాయి. అయితే ఓఎన్‌జీసీ, జీ, సన్ ఫార్మా, బజాజ్‌ ఫైనాన్స్, ఆర్‌ఐఎల్‌, కోల్‌ ఇండియా, ఐబీ హౌసింగ్‌, విప్రో, డాక్టర్‌ రెడ్డీస్‌, ఇన్ఫోసిస్‌ 4.5-0.7 శాతం మధ్య ఎగశాయి. 

ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్‌ స్టాక్స్‌లో సుజ్లాన్, జెట్‌ ఎయిర్‌వేస్‌, రిలయన్స్ కేపిటల్‌, లుపిన్, సీజీ పవర్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, కమిన్స్‌ 9-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క ఇన్ఫీబీమ్‌, సెయిల్‌, కర్ణాటక బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ, సన్‌ టీవీ, ఆర్‌పవర్, ఇండియా సిమెంట్స్‌, సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ 8.4-2.7 శాతం మధ్య పతనమయ్యాయి. మార్కెట్లు ఊగిసలాట మధ్య ముగిసిన నేపథ్యంలో మధ్య, చిన్నతరహా షేర్లలోనూ అమ్మకాలదే పైచేయిగా నిలిచింది. బీఎస్‌ఈలో ట్రేడైన షేర్లలో 1404 నష్టపోగా.. 1127 లాభాలతో ముగిశాయి. 

సైలెన్స్ ప్లీజ్‌
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) స్వల్పంగా రూ. 73 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) సైతం రూ. 68 కోట్ల విలువైన స్టాక్స్ మాత్రమే విక్రయించడం గమనార్హం! కాగా.. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 1038 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా..  డీఐఐలు దాదాపు రూ. 338 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గుడ్‌ఫ్రైడే సందర్భంగా శుక్రవారం మార్కెట్లకు సెలవు.Most Popular