NBFC ల కంటే గోల్డ్ లోన్ కంపెనీలే బెటరా..?  రిజల్ట్ అలానే ఉంది మరి..!

NBFC ల కంటే గోల్డ్ లోన్ కంపెనీలే బెటరా..?  రిజల్ట్ అలానే ఉంది మరి..!

దేశంలో గత సంవత్సర కాలంగా నాన్ బ్యాంకింగ్ కంపెనీలకు నగదు లిక్విడిటీ సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. కానీ ఇదే సమయంలో గోల్డ్ లోన్లు ఇచ్చే కంపెనీలైన మూత్హూట్ , మణుప్పురం ఫిన్ వంటి  స్టాక్స్ గణనీయమైన లాభాలను చూపించాయి. లిక్విడిటీ సమస్యలు ఉన్నా.. ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో ఈ కంపెనీలు విజయం సాధించాయనే చెప్పొచ్చు. గత 7 నెలల్లో మణుప్పురం, ముత్తూట్ కంపెనీలు తమ వాటాదారులకు లాభాలను చూపించాయి. సెప్టెంబర్ 2018 నాటికి  ముత్హూట్ ఫిన్ స్టాక్స్ దాదాపు 50శాతం పెరగగా, మణుప్పురం ఫిన్ స్టాక్స్ దాదాపు 26శాతం పెరిగాయి. ఇదే సమయంలో నాన్ బ్యాంకింగ్ కంపెనీలైన DHFL -74శాతం నష్టపోగా,  ఇండియా బుల్స్ హౌజింగ్ -34 శాతం నష్టపోయింది. బజాజ్ ఫిన్ 6శాతం పెరగగా,  శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్ -8శాతం నష్టపోయింది. L&T ఫైనాన్స్ -17శాతం నష్టపోగా  కెన్ ఫిన్ హోమ్స్ 8శాతం పెరిగింది. 

Image result for muthoot fin
గోల్డ్ లోన్స్ వ్యాపారం సులభతరం, సురక్షితం కావడంతో ప్రజలు ఈ కంపెనీల వైపు మొగ్గు చూపారు. దేశంలోని మధ్య తరగతి ప్రజలు లోన్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరగడం తగ్గించి తమ నగలను కుదవ పెట్టి తమ నగదు అవసరాలను తీర్చుకుంటున్నారని , అందుకే గోల్డ్ లోన్ కంపెనీల పనితీరు మెరుగ్గా ఉందని ఎనలిస్టులు పేర్కొంటున్నారు.  నాన్ బ్యాంకింగ్ సంస్థల కార్యకలాపాలు చాల వరకూ నిలిచి పోవడంతో ప్రజలు రుణ అవసరాల కోసం మణుప్పురం, ముత్హూట్ వంటి కంపెనీల వైపు చూస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నాన్ బ్యాంకింగ్ కంపెనీల పరపతి తగ్గడం, ప్రజల విశ్వసనీయత గోల్డ్ లోన్ కంపెనీలవైపే ఉండటంతో గోల్డ్ లెండర్స్ వ్యాపారాలు పుంజుకున్నాయి. 2017లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ లోన్ కంపెనీల వ్యాపార విధానాలను సవరించడంతో మళ్లీ ఇవి పుంజుకోడానికి దోహద పడింది.  అప్పర్ లిమిట్ విధానంలో సవరణలు గోల్డ్ లోన్ కంపెనీలకు వరంలా మారాయి. రూ. 20,000 నుండి రూ. 1 లక్ష వరకూ రుణ పరిమితులను పెంచడంతో గోల్డ్ లోన్ కంపెనీల లావాదేవీలు పెరిగాయని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. రానున్న 2020 ఆర్ధిక సంవత్సరం చివరి కల్లా గోల్డ్ లోన్ కంపెనీల గ్రోత్ 16-18 శాతం పెరగొచ్చని బ్రోకింగ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.

Image result for manappuram finance

ఈక్రమంలో మణుప్పురం, ముత్హూట్ కంపెనీలు తమ వ్యాపార విస్తరణకు పునాదులు వేస్తున్నాయి. కమర్షియల్ వెహికిల్స్‌కు రుణాలు, హౌజింగ్ ఫైనాన్స్ రంగంలోకి, మైక్రో ఫైనాన్స్ లోకి తమ వ్యాపారాలను విస్తరించనున్నాయి ఈ రెండు కంపెనీలు. నాన్ గోల్డ్ లోన్స్ విషయంలో గత మార్చ్ నెలాఖరుకు మణుప్పురం గోల్డ్ ఫిన్ కంపెనీ 2శాతం వృద్ధిని కనబరిచింది. మూత్హూట్ ఫిన్ కూడా తన వ్యాపార రెవిన్యూలో గత మార్చ్ ఎండింగ్‌ కల్లా 12శాతం వృద్ధిని నమోదు చేసింది. వార్షిక వృద్ధి రేటు 6శాతం పెరుగదలతో ఉందని కంపెనీ వెల్లడించింది. 

Image result for gold loan
ప్రముఖ బ్రోకింగ్ సంస్థలు  మణుప్పురం సంస్థ స్టాక్స్ కు బై రేటింగ్స్ ను ఇచ్చాయి.  మూత్తూట్‌కు కూడా ఉన్న బ్రోకింగ్ సంస్థల్లో 80శాతం సంస్థలు బై రేటింగ్స్ ను ఇచ్చాయి. రానున్న 12 నెలల్లో ఈ రెండు స్టాక్స్ మంచి లాభాలను కనబరచవచ్చని బ్రోకింగ్ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. 



Most Popular