డీమార్ట్‌ డీలా- కెపాసైట్‌ అప్‌

డీమార్ట్‌ డీలా- కెపాసైట్‌ అప్‌

కొద్ది రోజులుగా నేలచూపులకే పరిమితమవుతున్న డీమార్ట్‌ స్టోర్ల నిర్వహణ సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ కౌంటర్లో మరోసారి ఇన్వెస్టర్లు అమ్మకాలకే ఆసక్తి చూపుతున్నారు. దీంతో లాభాల మార్కెట్లోనూ ఈ షేరు నీరసంగా కదులుతోంది. కాగా మరోపక్క కొత్తగా కాంట్రాక్టులను సంపాదించినట్లు వెల్లడించడంతో మౌలిక సదుపాయాల సంస్థ కెపాసైట్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వివరాలు చూద్దాం..

ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌
గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో 14 శాతం వరకూ క్షీణించిన ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ షేరు మరోసారి డీలాపడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 2.2 శాతం నష్టంతో రూ. 1297 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1293 వరకూ వెనకడుగు వేసింది. ఇది ఐదు నెలల కనిష్టంకాగా.. గతేడాది(2018-19) చివరి త్రైమాసికంలోనూ మార్జిన్లపై ఒత్తిడి కొనసాగే అవకాశమున్న అంచనాలు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. క్యూ3లో ఇబిటా మార్జిన్లు 10.3 శాతం నుంచి 8.3 శాతానికి మందగించాయి. దీంతో క్యూ4(జనవరి-మార్చి) మార్జిన్లపై కొంతమేర ఆందోళలున్నట్లు తెలియజేశారు.

Image result for capacite infraprojects ltd

కెపాసైట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌
ముంబైలో వాణిజ్య, రెసిడెన్షియల్‌ బిల్డింగుల నిర్మాణం కోసం మొత్తం రూ. 342 కోట్ల విలువైన రెండు కాంట్రాక్టులు లభించినట్లు కెపాసైట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తాజాగా వెల్లడించింది. వీటిని కాలపరిమితిలోగా పూర్తిచేయగలమని తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో కెపాసైట్‌ షేరు 2 శాతం పెరిగి రూ. 233 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 235 వరకూ బలపడింది.Most Popular