లుపిన్‌- దీపక్‌ ఫెర్టిలైజర్స్‌ జోరు

లుపిన్‌- దీపక్‌ ఫెర్టిలైజర్స్‌ జోరు

విదేశీ బ్రోకింగ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ షేరు రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేయడంతో దేశీ హెల్త్‌కేర్ దిగ్గజం లుపిన్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ జోరందుకుంది. మరోపక్క నిధుల సమీకరణకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించడంతో దీపక్‌ ఫెర్టిలైజర్స్‌ అండ్‌ పెట్రోకెమికల్స్‌ కౌంటర్ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఈ రెండు కౌంటర్లూ సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం...

లుపిన్‌ లిమిటెడ్‌
గ్లోబల్‌ రీసెర్చ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ తాజాగా లుపిన్‌ షేరు రేటింగ్‌ను ఈక్వల్‌ వెయిట్‌ నుంచి ఓవర్‌వెయిట్‌కు అప్‌గ్రేడ్‌ చేసింది. దీంతోపాటు లుపిన్‌ షేరుకి రూ. 1094 టార్గెట్‌ ధరను ప్రకటించింది. దీంతో ఈ కౌంటర్లో ట్రేడింగ్‌ ఇప్పటివరకూ గత 20 రోజుల సగటుతో పొలిస్తే మూడు రెట్లు ఎగసింది. ఈ నేపథ్యంలో లుపిన్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 3.6 శాతం జంప్‌చేసి రూ. 861 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 869 వవరకూ ఎగసింది. 

Related image

దీపక్‌ ఫెర్టిలైజర్స్
విదేశీ మారక బాండ్ల(ఎఫ్‌సీసీబీ) జారీ ద్వారా 3 కోట్ల డాలర్లు(రూ. 200 కోట్లు) సమీకరించేందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తాజాగా దీపక్ ఫెర్టిలైజర్స్‌ పేర్కొంది. రెండు దశలలో వీటిని ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కంపెనీ(ఐఎఫ్‌సీ)కి జారీ చేయనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో దీపక్‌ ఫెర్టిలైజర్స్ షేరు దాదాపు 2 శాతం పెరిగి రూ. 153 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 155 వరకూ ఎగసింది.Most Popular