భారత్‌కు అమెరికా ఆయిల్ పంచ్‌...! ఇక పెట్రో బాదుడు తప్పదా..?

భారత్‌కు అమెరికా ఆయిల్ పంచ్‌...! ఇక పెట్రో బాదుడు తప్పదా..?

అమెరికా ఇరాన్‌పై విధించిన ఆంక్షలు ముందు ముందు భారత దేశ ఆర్ధిక వ్యవస్థపై పెను ప్రభావం చూపొచ్చు. ఇప్పటిదాకా  అమెరికా భారత్‌ విషయంలో ఇరాన్‌ నుండి చమురు కొనుగోళ్ళపై రాయితీలను ఇచ్చింది. 6 నెలల పాటు ఇచ్చిన రాయితీలు ఈ మే నెల మొదటి వారంలో ముగుస్తాయి. తాజాగా ట్రంప్ ఇరాన్‌ నుండి చమురు కొనుగోళ్ల విషయంలో మరింత కఠినంగా ఉంటామని , భారత్‌, చైనాలకు ఇచ్చే సబ్సీడీలను ఇక ముందు ఇవ్వబోమని తేల్చి చెప్పడంతో భారత్ ఇరుకున పడినట్టైంది. ఒక వేళ భారత్ మే నెల నుండి ఇరాన్‌ నుండి చమురు దిగుమతి చేసుకుంటే ..అమెరికా ఆగ్రహానికి గురికావాల్సి రావొచ్చు. ఇప్పటిదాకా అమెరికా నుండి ఎగుమతులు, దిగుమతుల విషయంలో ప్రత్యేక రాయితీలను పొందిన భారత్ వాటిని కోల్పోవాల్సి రావొచ్చు. ఇది భారతీయ మార్కెట్లపై, ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇరాన్‌పై విధించిన ఆంక్షల మూలంగా ఇప్పటికే అంతర్జాతీయంగా చమురు బ్యారెళ్ళ ధరలు పెరిగిపోయాయి. 

Image result for Iran crude oil rigs
గతేడాది ఆగస్టులో క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌  ధర 68 డాలర్లు ఉండగా, అక్టోబరు నాటికి అది ఏకంగా 86 డాలర్లకు చేరింది. ఇరాన్‌ ముడి చమురును చైనా తర్వాత మన దేశమే  అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో మన దగ్గర ముందు ముందు పెట్రోల్ , డీజిల్ రేట్లు మరింతగా పెరగొచ్చని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. గతంలో  రాజకీయంగా ఒత్తిడి రావడంతో చమురు కొనుగోళ్లకు సంబంధించి భారత్‌కు మాత్రం ఆరు నెలల పాటు రాయితీ ఇస్తూ అమెరికా వెసులుబాటు కల్పించింది. మే మొదటి వారంతో ఈ గడువు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో రాయితీలను ఇంకా కొనసాగించలేమని అమెరికా స్పష్టం చేసింది. అమెరికాలో షెల్ చమురు ఉత్పత్తులు పెరగడంతో ఆ దేశానికి ఢోకా లేకుండా పోయింది. ప్రస్తుత ఆంక్షల నేపథ్యంలో చైనా , భారత్ , పశ్చిమాసియా దేశాలు తీవ్ర పరిణామాలను ఎదర్కోవాల్సి వస్తుంది. మరో వైపు ఇరాన్ అమెరికాపై ప్రతికార చర్యగా హర్మూజ్ జల సంధిని దిగ్భంధనం చేస్తే.. ఆ ప్రభావం చైనా, సౌదీ అరేబియా , అరబిక్ కంట్రీస్‌ మీద పడుతుంది. దీంతో ఈ దేశాల నుండి కూడా మనకు వ్యాపార అవకాశాలు , రెవిన్యూ గణనీయంగా పడిపోయే ఛాన్స్ ఉందనే అంతర్జాతీయ పరిశీలకులు అంటున్నారు. 
ఇరాన్ తన అణ్వస్త్ర ఆయుధాలపై నియంత్రణ విధించుకోవాలని అమెరికా కోరగా ఆదేశం తిరస్కరించింది. ఇరాన్‌ ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతుల మీద అమెరికా దెబ్బ కొట్టాలని భావించి ఇరాన్‌ నుండి ఇతర దేశాలు చమురు కొనుగోలు చేయొద్దని ఆంక్షలు విధించింది. దీంతో ప్రస్తుతం ఆసియా పసిఫిక్ దేశాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. 

Image result for Iran crude oil rigs
ఇక అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగొచ్చు. ఇప్పుడు దేశంలో సార్వత్రిక ఎన్నకలు నడుస్తున్న నేపథ్యంలో పెట్రో కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం రేట్లను పెంచొద్దని కోరే అవకాశం ఉంది. కానీ.. ఇది ఇండియన్ పెట్రో కంపెనీల మీద ఆర్ధిక భారం మోపనుంది. పెట్రోల్, డీజిల్ ధరలను  ఇప్పటికే  స్టేట్ ఓన్డ్ కంపెనీలు పెంచేశాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు పాటించాలంటే... పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరల ప్రకారం చూస్తే.. మరో పది శాతం పెంచాల్సి ఉంటుంది. ఇది వినియోగదారుల మీద మరింత భారం గా మారనుంది. Most Popular