తేజాస్‌ నెట్‌ స్పీడ్‌- గెయిల్‌ డౌన్‌

తేజాస్‌ నెట్‌ స్పీడ్‌- గెయిల్‌ డౌన్‌

గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో తేజాస్‌ నెట్‌వర్క్స్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోవైపు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ విండ్‌ పవర్‌ ప్లాంట్లకు టాప్‌ బిడ్డర్‌గా నిలిచినట్లు వెల్లడికావడంతో ఇంధన రంగ పీఎస్‌యూ సంస్థ గెయిల్‌ ఇండియా కౌంటర్‌లో అమ్మకాలు తలెత్తాయి. ఇతర వివరాలు చూద్దాం..

తేజాస్‌ నెట్‌వర్క్స్‌
గతేడాది క్యూ4లో తేజాస్‌ నెట్‌వర్క్స్‌ నికర లాభం 23 శాతం పెరిగి రూ. 36 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా రూ. 112 కోట్ల నుంచి రూ. 280 కోట్లకు జంప్‌చేసింది. కన్సాలిడేటెడ్‌ ఫలితాలివి. వాటాదారులకు షేరుకి రూ. 1 చొప్పున తుది డివిడెండ్‌ ప్రకటించింది. ఇక 2018-19 పూర్తి ఏడాదికి నికర లాభం 38 శాతం వృద్ధితో రూ. 147 కోట్లను అధిగమించింది. ఈ నేపథ్యంలో తేజాస్‌ నెట్‌వర్క్స్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 6 శాతం జంప్‌చేసి రూ. 197 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 206 వవరకూ ఎగసింది. 

Related image

గెయిల్‌ ఇండియా
ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు చెందిన పవన విద్యుత్‌ ప్లాంట్ల కొనుగోలుకి గరిష్ట బిడ్డర్‌గా నిలిచినట్లు వెల్లడికావడంతో ఇంధన రంగ పీఎస్‌యూ గెయిల్‌ ఇండియా కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ప్లాంట్ల కోసం గెయిల్‌ రూ. 4800 కోట్ల విలువైన ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ మొత్తం 874 మెగావాట్ల పవన విద్యుత్‌ సామర్థ్యం కలిగి ఉంది. వీటిపై రూ. 3700 కోట్ల రుణ భారం ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో గెయిల్‌ షేరు 3.2 శాతం పతనమై రూ. 334 వద్ద ట్రేడవుతోంది. Most Popular